Mamta Kulkarni : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహాకుంభమేళా ఎంతో ఘనంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమం వద్ద పుణ్యసాన్నాలను ఆచరిస్తున్నారు. కాగా.. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ సైతం కుంభమేళాలో దర్శనం ఇచ్చింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు గానీ సదరు నటి సన్యాసినిగా మారిపోవడమే ఇక్కడ అసలు ట్విస్ట్. ప్రస్తుతం సదరు నటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు మమతా కులకర్ణి.
మమతా కులకర్ణి.. ఇప్పటి తరానికి పెద్దగా తెలియపోవచ్చు గానీ.. 90వ దశకంలో బాలీవుడ్‌ని షేక్ చేసింది అమ్మడు. తన అందం, నటనతో కుర్రాళ్ల హృదయాలను చెదరగొట్టింది. తెలుగులోనూ ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా సడెన్‌గా చిత్ర పరిశ్రమకు దూరం అయింది. అయితే.. దాదాపు 25 సంవత్సరాల తరువాత ఆమె భారత్‌కు వచ్చింది.
శుక్రవారం (జనవరి 24న) కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాస దీక్ష తీసుకుంది. అంతేకాదండోయ్ తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకుంది. కాషాయ దుస్తులు ధరించి మెడలో రుద్రాక్ష మాల, భుజానికి జోలె ధరించి కనిపించింది. కొన్ని ఫోటోలు, వీడియోలను ఆమె స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
అయోధ్య వెళ్తా..
మౌని అమావాస్య (జనవరి 29న) రోజున రాజస్నానం చేసి విశ్వనాథ ఆలయానికి వెళ్తానని ఆమె తెలిపారు. అనంతరం అయోధ్యకు వెళ్లి అక్కడ విరాళం ఇస్తానన్నారు.
RC 16 : రామ్ చరణ్ సినిమాకు రెహమాన్ రాం రాం?