RC 16 : రామ్‌ చరణ్‌ సినిమాకు రెహమాన్‌ రాం రాం?

RC 16 సినిమాపై టాలీవుడ్‌లో ఓ గాసిప్ బిగ్ సౌండ్ చేస్తోంది.

RC 16 : రామ్‌ చరణ్‌ సినిమాకు రెహమాన్‌ రాం రాం?

AR Rahman exit from RC 16 movie

Updated On : January 25, 2025 / 8:44 AM IST

Gossip Garage : గేమ్‌ఛేంజర్‌ మూవీ తర్వాత రామ్‌చరణ్ తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఓ గాసిప్ బిగ్ సౌండ్ చేస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా AR రెహమాన్ పని చేస్తున్న విషయం తెలిసిందే.

షూటింగ్‌కు ముందే రెండు సాంగ్స్‌కి ట్యూన్స్ కూడా కట్టి ఇచ్చాడని టాక్. అలాంటి రెహమాన్ ఇప్పుడు సడెన్‌గా చెర్రీ మూవీ నుంచి ఎగ్జిట్ అయ్యాడనే న్యూస్ వైరల్ అవుతోంది. రెహమాన్ ప్లేస్‌లో మరో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చాన్స్ కొట్టేశారనే ప్రచారం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ సినిమా కోసం రెహమాన్‌ను బుచ్చి బాబు ఏరి కోరి తెచ్చుకున్నాడు, మరి అలాంటి బుచ్చి బాబు రెహమాన్‌ను ఎందుకు వదులుకుంటాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Sankranthiki Vasthunam : భీమవరంలో ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరం.. ఎప్పుడో తెలుసా?

అయితే చరణ్ సినిమాను ఎట్టిపరిస్థితిల్లో దసరాకి రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. కానీ స్వరాలు అందించేందుకు రెహమాన్‌కు ఉన్న బిజీలో చాలా టైమ్ పట్టే అవకాశాలు ఉన్నాయి. దేవిశ్రీ అయితే అనుకున్న టైమ్‌కు ఇస్తాడని మూవీ యూనిట్ భావిస్తోందట.

రెహమాన్ కూడా ఇటీవల తన భార్యకు డైవర్స్ ఇవ్వడం, పర్సనల్ ప్లాబ్లమ్స్‌తో కొన్ని కీలక ప్రాజెక్ట్‌లతో బీజీగా ఉన్నాడు. ఇలాంటి టైమ్‌లో రెహమాన్‌తో త్వరగా మ్యూజిక్ కంపోజ్ చేయించడం కష్టమైన పనే. అందుకే డైరెక్టర్ బుచ్చిబాబు దేవీశ్రీని రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ గాసిప్‌లో నిజమెంతా అని మూవీ టీమ్ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది.

Benefit Shows : టాలీవుడ్‌కి హైకోర్టు బిగ్ షాక్.. బెనిఫిట్ షోలపై సంచలన ఆదేశాలు..