Sankranthiki Vasthunam : భీమవరంలో ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరం.. ఎప్పుడో తెలుసా?

సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ టీమ్‌ గ్రాండ్ స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.

Sankranthiki Vasthunam : భీమవరంలో ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరం.. ఎప్పుడో తెలుసా?

Sankranthiki Vasthunam Blockbuster sambaram

Updated On : January 24, 2025 / 9:30 PM IST

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన మూవీ సంక్రాంతికి వ‌స్తున్నాం. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే థియేట‌ర్ల‌లో న‌వ్వులు పూయిస్తూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రానికి బ్ర‌హ్మార‌థం ప‌డుతున్నారు. తొమ్మిది రోజుల్లో ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.230 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం వెల్ల‌డించింది.

తొలి రోజే ఈ చిత్రం రూ.45 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి వెంకీ కెరీర్‌లోనే మొద‌టి రోజు అత్య‌ధిక కలెక్ష‌న్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. సంక్రాంతి సెల‌వులు పూర్తైనా, రెండో వారం పూర్తి కావొస్తున్నా కూడా థియేట‌ర్ల‌లో ఈ చిత్రం హ‌వా త‌గ్గ‌లేదు. క‌లెక్ష‌న్లు స్ట‌డీగా ఉన్నాయి. ఊహించ‌ని విజ‌యం సాధించ‌డంతో చిత్ర బృందం య‌మా ఖుషిగా ఉంది.

Sankranthiki Vasthunam : దిల్ రాజుకు మ‌రో షాక్‌.. ఏపీ హైకోర్టులో సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీపై పిల్

ఈ నేప‌థ్యంలో గ్రాండ్ స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. భీమ‌వ‌రంలో జ‌న‌వ‌రి 26న నిర్వ‌హించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బ్లాక్ బాస్ట‌ర్ సంబ‌రాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొంది. ఈ విష‌యాన్ని ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.

Hathya Review : ‘హత్య’ మూవీ రివ్యూ.. మర్డర్ మిస్టరీ..

భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్‌లు క‌థానాయిక‌లు న‌టించ‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.