Sankranthiki Vasthunam : దిల్ రాజుకు మరో షాక్.. ఏపీ హైకోర్టులో సంక్రాంతికి వస్తున్నాం మూవీపై పిల్
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలైంది.

Pil File in Andhra pradesh high court on Sankranthiki Vasthunam Movie
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మూవీ బడ్జెట్, కలెక్షన్ల విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పిటిషనర్ న్యాయస్థానంలో ఈ పిల్ ను దాఖలు చేశారు. ఈ సినిమా అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, ఐటీ, ఈడీ, జీఎస్టీతో విచారణ జరిపించాలని పేర్కొన్నారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెచ్చింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు కథానాయికగాలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
Hathya Review : ‘హత్య’ మూవీ రివ్యూ.. మర్డర్ మిస్టరీ..
విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది. తొలి రోజే ఈ చిత్రం రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో పాటు పలు వివాదాలు సైతం చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నాలుగు రోజులు పాటు ఐటీ అధికారులు దిల్ రాజు ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏపీ హైకోర్టులో ఈ చిత్ర ఆదాయం పై పిల్ దాఖలైంది.