SSMB 29 : సింహాన్ని బంధించిన జక్కన్న.. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కామెంట్స్ వైరల్.. SSMB 29 ప్రారంభమైనట్లేనా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Director SS Rajamouli Update on SSMB 29 project
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినీ ప్రియులంతా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేశ్‌బాబు కెరీర్‌లో 29 మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే SSMB 29 చిత్ర పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ కార్యక్రమం జరుగగా చిత్ర బృందంతో పాటు మహేశ్‌బాబు పాల్గొన్నారు. దీనిపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికి కూడా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.
సింహాన్ని బంధించినట్లుగా అర్థం వచ్చేలా ఈ వీడియో ఉంది. రాజమౌళి పాస్‌పోర్ట్ పట్టుకుని ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. దీంతో సినిమా షూటింగ్ ప్రారంభమైందని, మహేశ్‌బాబును రాజమౌళి లాక్ చేశారని నెటిజన్లు అంటున్నారు. అయితే.. రాజమౌళి పోస్టుకు మహేశ్‌బాబు, నమ్రతా, ప్రియాంక చోప్రాలు స్పందించడం గమనార్హం.
RC 16 : రామ్‌చరణ్ మూవీ నుంచి రెహమాన్ ఔట్..? కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
“ఒక్కసారి కమిట్ అయితే.. నా మాట నేనే వినను.” అంటూ మహేశ్ బాబు పోకిరి డైలాగ్‌ను కామెంట్ చేశారు. చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్‌కు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఆల్‌ది బెస్ట్ చెప్పింది. షూటింగ్ ప్రారంభమైందని అర్థం వచ్చేలా.. “ఫైనల్లీ” అంటూ ప్రియాంక చోప్రా నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది.
హీరోయిన్‌గా ఫిక్సైనట్లేనా..
యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ప్రియాంక లాస్ ఏంజెలెస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఇప్పుడు రాజమౌళి పోస్టుకు ఆమె స్పందించడంతో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఫిక్సైనట్లేనని అంటున్నారు. అయితే.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్లు భాగంగా కానున్నట్లు ఇప్పటికే రాజమౌళి తెలిపారు.
Sankranthiki Vasthunam : భీమవరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరం.. ఎప్పుడో తెలుసా?
View this post on Instagram