Mamta Mohandas effected with chronic auto immune disease
Mamta Mohandas : సింగర్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మమతా మోహన్ దాస్ ఆ తర్వాత హీరోయిన్ గా మారి తెలుగు, తమిళ్, మలయాళంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో యమదొంగ, చింతకాయల రవి, కింగ్, కేడి.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. ఆ తర్వాత మలయాళం సినిమాలతో బిజీ అయినా అప్పుడప్పుడు తెలుగులో సాంగ్స్ తో అలరించింది ఈ మలయాళ భామ.
గతంలోనే క్యాన్సర్ తో పోరాడి తిరిగి వచ్చింది మమతా మోహన్ దాస్. ఆ తర్వాత లింఫోమా అనే వ్యాధితో కూడా బయటపడింది. క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చినా బాధపడకుండా కష్టపడి, ఓర్చుకొని, ట్రీట్మెంట్స్ తీసుకొని ఆ వ్యాధుల నుంచి పోరాడి బయటపడింది. క్యాన్సర్ తో పోరాడి వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోయిన్ గా పలు మలయాళం సినిమాలతో బిజీగా ఉంది మమతా మోహన్ దాస్.
SSMB28 : SSMB28 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..
తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటోని షేర్ చేసి.. తన శరీరం రంగుని కోల్పోయే క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ (బొల్లి వ్యాధి) తో బాధపడుతున్నట్టు తెలిపింది. అలాగే రోజూ దీనికోసం సూర్యకిరణాలు అవసరమని, ఇకనుంచి పొద్దున్నే లేచి సూర్యుడి ముందు కూర్చుంటానని, సూర్య కిరణాలు నన్ను తాకాలని తెలిపింది. దీంతో ఈ హీరోయిన్ ఇప్పటికే క్యాన్సర్ తో పోరాడి వచ్చి మళ్ళీ ఇంకో వ్యాధితో పోరాడుతుండటంతో త్వరగా కోలుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది అంత పెద్ద వ్యాధి కాదని, ఒక స్కిన్ ఎలర్జీ లాంటిదని, ఇది కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.