Mana Shankara VaraPrasad Garu : వినాయకచవితి స్పెషల్.. కేరళ నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’..

వినాయక చవితి పండగ పూట మెగాస్టార్ కొత్త పోస్టర్ వైరల్ గా మారింది..(Mana Shankara VaraPrasad Garu)

Mana Shankara VaraPrasad Garu

Mana Shankara VaraPrasad Garu : మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సంక్రాతికి రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేసి ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచారు. మన శంకర వరప్రసాద్ గారు అనే ఆసక్తికర టైటిల్ తో అనిల్ రావిపూడి ఫ్యామిలీ మార్క్ ఉంటుందని చెప్పేసారు.(Mana Shankara VaraPrasad Garu)

నేడు వినాయక చవితి సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కేరళలో పూర్తి చేసారు. కేరళ షూట్ లో తీసిన ఒక ఫొటోతో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో చిరంజీవి నదిలో పడవ పై స్టైల్ గా నిల్చొని సాంప్రదాయంగా పట్టు పంచె కట్టుకొని ఉన్నారు. దీంతో పండగ పూట మెగాస్టార్ కొత్త పోస్టర్ వైరల్ గా మారింది..

Also See : Supritha : తల్లి సురేఖవాణితో కలిసి సుప్రీత వినాయకచవితి పూజలు.. ఫొటోలు..