Manasa Varanasi : ఇంట్లో చెప్పకుండా కిస్ సీన్ చేసిన హీరోయిన్.. ఇంట్లో తెలిసాక.. పాపం..
కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో మానస వారణాసి -సంతోష్ శోభన్ మధ్య కిస్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. (Manasa Varanasi)
Manasa Varanasi
Manasa Varanasi : మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సంతోష్ శోభన్ తో కలిసి మానస వారణాసి నటించిన కపుల్ ఫ్రెండ్లీ వాలెంటైన్స్ డేకి ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మానస వారణాసి నేడు మీడియాతో మాట్లాడింది.(Manasa Varanasi)
కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో మానస వారణాసి -సంతోష్ శోభన్ మధ్య కిస్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ట్రైలర్ లోనే ఈ సీన్స్ చూపించారు. దీనిపై తన ఇంట్లోవాళ్ళు ఎలా స్పందించారో తెలిపింది.
Also Read : Hey Bhagawan : సుహాస్ ‘హే భగవాన్’ ట్రైలర్ వచ్చేసింది.. ఇంతకీ ఏం బిజినెస్ బాబు..
మానస వారణాసి మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చెప్పినప్పుడే రెండు కిస్ సీన్స్ ఉంటాయని చెప్పారు. లవ్ స్టోరీ కాబట్టి అర్ధం చేసుకున్నాను. టీమ్ అందరితో రెండు నెలలు ట్రావెల్ చేసాక నాకు ఒక కంఫర్ట్ వచ్చి ఆ సీన్స్ చేశాను. ఇలాంటి సీన్స్ లో నాకు లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ లోనే నేను చేస్తాను.
అయితే ఈ సీన్స్ ఉన్నాయని ముందు మా ఇంట్లో చెప్పలేదు. ట్రైలర్ చూసాక వాళ్ళు ఫీల్ అయ్యారు. కొంచెం ఫైర్ అయ్యారు. వారణాసి కుటుంబం పరువు అంటూ మాట్లాడారు. కొంచెం బాధపడ్డారు. అసలు మా ఇంట్లో సినిమాలంటేనే మొదట ఒప్పుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఇలా కిస్ సీన్ అంటే కష్టమే. వాళ్ళని కూల్ చేయడానికి చాలా రోజులు పట్టింది. వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాను. రిలేటివ్స్ కొంతమంది కామెంట్స్ చేస్తారు ఇంక అవి పట్టించుకోకూడదు అని తెలిపింది.
మొత్తానికి మానస వారణాసి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా కిస్ సీన్ చేసి ఇంట్లో వాళ్ళు తిడితే కన్విన్స్ చేసింది. మున్ముందు సినిమాల్లో కూడా కథని బట్టి కిస్ సీన్స్ ఉంటే చేస్తుందని తెలుస్తుంది.
Also Read : Star Actor : ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పుడు స్టార్ నటుడు ఇలా అయిపోయాడేంటి.. ఫోటో వైరల్..
మానస వారణాసి – సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ మీరు కూడా చూసేయండి..
