Manchu Family : మంచు కుటుంబం మధ్య నిప్పు ఆరుతుందా.. అన్నాతమ్ముళ్ల ట్వీట్స్ వైరల్..

ఈ మంచు కుటుంబ మంటలు చల్లారుతున్నట్టు అనిపిస్తుంది. (Manchu Family)

Manchu Family

Manchu Family : ఇటీవల కొన్ని రోజుల క్రితం మంచు కుటుంబం గొడవలతో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టు గొడవలు సాగి పోలీస్ స్టేషన్, కలక్టరేట్ వరకు వెళ్లారు. ఇక మనోజ్ – విష్ణు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న రేంజ్ లో ఇద్దరూ మీడియా ముందు మాట్లాడటం, ట్వీట్స్ వేయడం చేసారు. మనోజ్ అయితే బహిరంగంగా కౌంటర్లు వేసాడు.(Manchu Family)

కానీ ఇప్పుడు ఈ మంచు కుటుంబ మంటలు చల్లారుతున్నట్టు అనిపిస్తుంది. విష్ణు కన్నప్ప సినిమా రిలీజ్ ముందు మనోజ్ సైలెంట్ అయి కన్నప్ప కి విషెష్ చెప్పాడు. సినిమా చూసి సినిమా గురించి పాజిటివ్ గా చెప్పాడు. ఆ సినిమాకు అవార్డులు వస్తే అభినందించాడు. కానీ విష్ణు మాత్రం ఎక్కడా తమ్ముడు గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు.

Also Read : Mirai Sequel : ‘మిరాయ్’ సీక్వెల్ టైటిల్ ఏంటో తెలుసా? కలియుగంలో రావణ వర్సెస్ రామ కథతో.. రావణుడు ఎవరంటే..

కట్ చేస్తే ఇప్పుడు మంచు మనోజ్ విలన్ గా నటించిన మిరాయ్ సినిమా రిలీజయింది. దీంతో ఈ సినిమాకు విషెష్ చెప్తూ మంచు విష్ణు ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ తో అంతా ఆశ్చర్యపోయారు. విష్ణునే ట్వీట్ చేసాడంటే దానికి రిప్లై ఇస్తూ మనోజ్ థ్యాంక్స్ అన్న అంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం. దీంతో ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.

విష్ణు ట్వీట్ తో గొడవలు వదిలేసి కలిసిపోయారా? కలుస్తారా? వీళ్ళ మధ్య వచ్చిన సమస్యలు తీరిపోయాయా అని చర్చ జరుగుతుంది. లేదా గొడవలు ఉన్నా అందరిముందు బాగున్నట్టు చూపిస్తున్నారా అని కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే ఎప్పటికైనా మీరు మీరు ఫ్యామిలీ ఒకటే అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Mirai Song : మళ్ళీ అదే పద్ధతి.. పాట సూపర్ హిట్.. సినిమాలో మాత్రం లేదు..