Manchu Family Property Dispute : మంచు ఫ్యామిలీలో మరోసారి మంటలు చెలరేగాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో తండ్రి మోహన్ బాబు, కొడుకు మనోజ్ ఒకరినొకరు సవాల్ చేసుకున్నారు. మెజిస్ట్రేట్ ముందే పరస్పరం బండ బూతులు తిట్టుకున్నారు. ఇద్దరూ మాటలతో యుద్ధం చేసుకున్నారు. పరస్పర దూషణలతో కోర్టు హాల్ లో తండ్రీ కొడుకులు రెచ్చిపోయారు.
తన ఆస్తుల్లో ఉన్న అందరినీ ఖాళీ చేయించాలంటూ రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్ పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు.
దీనిపై స్పందించిన కలెక్టర్.. మనోజ్ కు నోటీసులు ఇచ్చారు. దాంతో మంచు మనోజ్ కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో మెజిస్ట్రేట్ ముందు విచారణకు హాజరయ్యారు మనోజ్. విచారణ సందర్భంగా తండీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. మెజిస్ట్రేట్ ముందే మోహన్ బాబు, మనోజ్ దూషణలకు దిగినట్లు తెలిసింది.
మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. విచారణ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందే తండ్రీ కొడుకులు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ తిట్టుకున్నారు. పరస్పరం దూషణలకు దిగారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరినీ విచారణకు పిలిచారు అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్. తన ఆస్తిలో మంచు మనోజ్ పాగా వేశారని గతంలో మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మనోజ్ ని విచారించిన అధికారులు తాజాగా ఇద్దరినీ విచారణకు పిలిచారు.
Also Read : మళ్ళీ తెరపైకి రాజ్ తరుణ్ – లావణ్య కేసు.. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు..
మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరైన మోహన్ బాబు, మంచు మనోజ్..
ఆస్తి తగాదాలో భాగంగా నటుడు మోహన్ బాబు ఫైల్ చేసిన సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద మంచు మనోజ్ పై సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. మధ్యాహ్నం 3 గంటలకు కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు మోహన్ బాబు, మంచు మనోజ్.
గత నెల 18న రంగారెడ్డి జిల్లా అదనపు మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరై వివరాలు వెల్లడించారు మనోజ్. నేడు మరోసారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. దాంతో మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు మోహన్ బాబు, మంచు మనోజ్.
కాగా.. విచారణ సందర్భంగా మెజిస్ట్రేట్ ఎదుటే మంచు మనోజ్, మోహన్ బాబు పరస్పరం దూషణలకు దిగాడం హాట్ టాపిక్ గా మారింది. కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆస్తి తగాదాకి సంబంధించి అదనపు కలెక్టర్ కి పూర్తి వివరాలు అందజేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వెనుదిరిగారు మోహన్ బాబు, మనోజ్.
Also Read : ఎంత కర్మ పట్టిందిరా అయ్యా నీకు.. దొంగగా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు.. ఎందుకో తెలిస్తే షాకే..
మీడియాతో మాట్లాడకుండా ఆవేశంగా వెళ్లిపోయిన మనోజ్..
సుమారు రెండు గంటల పాటు మెజిస్ట్రేట్ విచారణ సాగింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా మంచు మనోజ్ ఆవేశంగా వెళ్లిపోయారు. వచ్చే వారం మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ వారికి ఆదేశించారు.