Manchu Lakshmi : అవును మా భర్త, నేను దూరంగానే ఉంటున్నాం.. కానీ.. మంచు లక్ష్మి కామెంట్స్.. మోహన్ బాబుపై వచ్చిన ఆరోపణలు అబద్దమేనా..

తాజాగా వీటన్నిటికీ మంచు లక్ష్మి క్లారిటీ ఇస్తూ మాట్లాడింది.

Manchu Lakshmi : అవును మా భర్త, నేను దూరంగానే ఉంటున్నాం.. కానీ.. మంచు లక్ష్మి కామెంట్స్.. మోహన్ బాబుపై వచ్చిన ఆరోపణలు అబద్దమేనా..

Manchu Lakshmi Gives Clarity on Divorce with her Husband Rumors

Updated On : February 24, 2025 / 7:26 PM IST

Manchu Lakshmi : మంచు ఫ్యామిలీ ఇటీవల రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది. గతంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన మంచు లక్ష్మి ప్రస్తుతం బాలీవుడ్ లో ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. ముంబైకి మకాం మార్చేసి మంచు లక్ష్మి అక్కడ సినిమాలు, సిరిస్ లలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది.

అయితే మంచు లక్ష్మి ఎప్పట్నుంచో తన భర్త యాండీ శ్రీనివాస్‌ తో దూరంగా ఉంటుంది. కరోనా సమయంలో ఇద్దరూ కలిసి పలు ఫొటోలు, వీడియోలలో కనపడ్డారు. ఆ ముందు, ఆ తర్వాత మాత్రం మంచు లక్ష్మి అసలు భర్తతో కనపడలేదు. మంచు లక్ష్మికి ఒక కూతురు కూడా ఉంది. అప్పుడప్పుడు కూతురితో కూడా ఫొటోలు షేర్ చేస్తుంది కానీ తన భర్తతో మాత్రం ఎలాంటి ఫొటోలు, వీడియోలు షేర్ చేయదు. దీంతో మంచు లక్ష్మి ఆమె భర్త యాండీ శ్రీనివాస్‌ విడిపోయారని, విడాకులు తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి.

Also See : IND vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో తెలుగు సెలబ్రిటీలు.. చిరంజీవి, సుకుమార్, నారా లోకేష్..

అంతే కాకుండా వీరిద్దరూ విడిపోవడానికి కారణం మోహన్ బాబు అని కూడా గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. తాజాగా వీటన్నిటికీ మంచు లక్ష్మి క్లారిటీ ఇస్తూ మాట్లాడింది. బాలీవుడ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నా భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఆయన విదేశాల్లో పనిచేస్తారు. మేమిద్దరం ఒకరికొకరం గౌరవం ఇచ్చుకుంటాం. అనవసరమైన అంచనాలు పెట్టుకోము. వేరే వాళ్ళ అభిప్రాయాలు పట్టించుకోము. మాకు ఎలా ఇష్టమో మేము అలాగే జీవిస్తాము. మేమిద్దరం ప్రస్తుతం బాగానే ఉన్నాము. కెరీర్ కారణంగా వెరీ వేరు చోట్ల ఉంటున్నాము. నా కూతురు ఇటీవల నా భర్త దగ్గరికి వెళ్ళింది. ప్రస్తుతం అక్కడే ఉంది. మాకు సమయం దొరికినప్పుడల్లా మేము కలుస్తాము. జనాలు ఏదో అనుకుంటారని మేము ఆలోచించము అని తెలిపింది.

Also See : Thandel Success Party : నాగచైతన్య సాయి పల్లవి ‘తండేల్’ సక్సెస్ పార్టీ.. తరలి వచ్చిన సినీ పరిశ్రమ.. ఫొటోలు చూశారా?

దీంతో మంచు లక్ష్మి – యాండీ శ్రీనివాస్‌ విడాకులు తీసుకోలేదని కలిసే ఉన్నారని క్లారిటీ ఇచ్చింది. వాళ్ళ డైవర్స్ పై వచ్చినవి అన్ని రూమర్స్ అని తేల్చేసింది. అసలు మోహన్ బాబుపై వచ్చిన ఆరోపణలు అన్ని అబద్దాలు అని ఇండైరెక్ట్ గా చెప్పేసింది. మరి మంచు లక్ష్మి – యాండీ శ్రీనివాస్‌ మళ్ళీ ఎప్పుడు కలిసి కనిపిస్తారో చూడాలి.