Manchu Lakshmi Special Role in Mohan Lal's Monster Movie
Manchu Lakshmi: సంపూర్ణ నటుడు మోహన్‌లాల్ హీరోగా 2016లో తెరకెక్కిన మాస్ బ్లాక్ బస్టర్ మూవీ “పులిమురుగన్”. ఈ సినిమా తెలుగులో ‘మన్యంపులి’ టైటిల్ తో విడుదలయ్యి గణ విజయాన్ని సాధించింది. అంతేకాదు మలయాళ చిత్రసీమలో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మొదటి సినిమాగా రికార్డులు సృష్టించింది.
Manchu Lakshmi : మంచులక్ష్మీ ‘ఆహా’ అనిపించడానికి మళ్ళీ వస్తోంది.. ‘చెఫ్ మంత్ర’ సీజన్ 2 త్వరలో..
మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత మోహన్ లాల్, దర్శకుడు వైశాఖ్ తో “మాన్‌స్టర్” అనే కొత్త చిత్రం కోసం జతకట్టాడు. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా, సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. మలయాళంలో మంచు లక్ష్మికు ఇదే తొలి చిత్రం.
ట్రైలర్‌ను బట్టి చూస్తే, మాన్‌స్టర్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నిండిన సస్పెన్స్ త్రిల్లర్ డ్రామాలా కనిపిస్తోంది. లక్కీ సింగ్ అనే పాత్రలో మోహన్ లాల్ మొదటిసారి సిక్కుగా కనిపిస్తాడు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమాపై హైప్ పెరిగింది. మొదట్లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కి ప్లాన్ చేసిన మేకర్స్ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీపావళి పండుగ సీజన్‌లో మాన్‌స్టర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.