Manchu Manoj and Bhuma Mounika attends Vennela Kishore Ala Modalaindi TV Show
Manoj – Mounika : మంచు మనోజ్(Manchu Manoj) గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. మొదటి భార్యకు గతంలో విడాకులు ఇచ్చి ఇటీవలే తన రాబోయే సినిమాని ప్రకటించి రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి(Bhuma Nagireddy) కూతురు భూమా మౌనికని(Bhuma Mounika) మార్చ్ 3 శుక్రవారం రాత్రి వివాహం చేసుకున్నాడు మనోజ్. వీరిద్దరిది ప్రేమ వివాహం కావడంతో, ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో హైదరాబాద్(Hyderabad) లోని మనోజ్ ఇంట్లోనే చాలా సింపుల్ గా వివాహం జరిగింది.
వివాహం తర్వాత మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు వెళ్లారు. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో మొదటిసారి ఈ జంట బయట కనపడ్డారు. తాజాగా ఈ జంట మొదటిసారి ఒక టీవీ షోకి వచ్చారు. ఓ టీవీ ఛానల్ లో వెన్నెల కిషోర్ హోస్ట్ గా అలా మొదలైంది అనే షోని ఇటీవల మొదలు పెట్టారు. ఇందులో పలువురు సెలబ్రిటీ భార్య భర్తలు వస్తున్నారు. వాళ్ళని వెన్నెల కిషోర్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీ జంటలు ఈ షోకి రాగా సరదాగా సాగుతుంది ఈ షో.
తాజాగా వెన్నెల కిషోర్ షోకు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మంచు మనోజ్, వెన్నెల కిషోర్ మంచి స్నేహితులు. దీంతో షోకి కిషోర్ పర్సనల్ గా పిలవడంతో మనోజ్ తన భార్యతో కలిసి వచ్చినట్టు సమాచారం. మనోజ్ పెళ్లి వార్తల్లో బాగా హైలెట్ అయింది. దీంతో ఈ జంట ఇలా టీవీ షోకి రావడంతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలా మొదలైంది మనోజ్ మౌనిక ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూశాక ఎపిసోడ్ లో వీరు అనేక విషయాలు, వీరి ప్రేమ గురించి, గొడవల గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది.
Mahesh Babu – Ram Charan : పెట్స్ ప్రేమలో పడిపోతున్న హీరో హీరోయిన్లు..
ప్రోమోలోనే మనోజ్.. మౌనిక కోసం ఆళ్లగడ్డకు వెళ్లినట్టు, మౌనిక అమ్మ మరణించాక మనోజ్ కోసమే కోరుకుందని, ఎక్కువగా ఇద్దరూ ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటారని, మనోజ్ కొంచెం ఎక్కువ రొమాంటిక్ అని.. ఇలా పలు విషయాలు చేసుకున్నారు. తను నా కోసం ఒక బిడ్డతో నిలబడింది, నేను తన కోసం నిలబడాలి అని మనోజ్ మౌనికను ఉద్దేశించి అన్నాడు. ప్రోమోనే ఇంత ఆసక్తికరంగా అందంటే ఇక ఫుల్ ఎపిసోడ్ లో ఎన్ని విషయాలు చెప్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.