Manchu Manoj – Vishnu : మళ్ళీ పోలిస్ స్టేషన్ కి మంచు ఫ్యామిలీ.. అన్నపై తమ్ముడు ఫిర్యాదు.. దొంగతనం చేసాడని..
తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు మనోజ్.

Manchu Manoj Complaint on Manchu Vishnu in Police Station Again
Manchu Manoj – Vishnu : గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలిలో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టు ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. మోహన్ బాబు, విష్ణు ఇవి ఆస్తి గొడవలు అంటుంటే మనోజ్ మాత్రం కాలేజీకి సంబంధించిన గొడవలు అంటున్నాడు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ వివాదం పోలీస్ స్టేషన్, కలక్టరేట్ వరకు వెళ్ళింది. ఒకరిపై ఒకరు దాడులు చేయించారని కూడా ఆరోపణలు వచ్చాయి.
తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు మనోజ్. నార్సింగి పోలీస్ స్టేషన్ లో సోదరుడు మంచు విష్ణు పై ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు తన వస్తువులను దొంగిలించాడని ఫిర్యాదు చేసాడు. అలాగే జల్ పల్లిలో ఉన్న ఇంటిలో కూడా 150 మంది చొరబడి విధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మనోజ్.
అలాగే.. నా ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతోపాటు కార్లను ఎత్తుకొని వెళ్లారు. నా ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో ఉన్నాయి. నా ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారు. ముఖ్యమైన వస్తువులన్నిటిని పగలకొట్టి విధ్వంసం చేశారు. నా కూతురు బర్త్ డే కోసం నేను రాజస్థాన్ కి వెళ్లగా నా సోదరుడు నా ఇల్లుని ధ్వంసం చేశాడు. నా ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై మా నాన్న మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. అందుకే నాకు న్యాయం చేయమని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశాను అని మీడియాకు తెలిపాడు మనోజ్. మరి మనోజ్ ఫిర్యాదుపై మంచు విష్ణు స్పందిస్తాడా లేదా చూడాలి.