Manchu Manoj's emotional comments about Little Hearts hero Mouli
Manchu Manoj: టాలీవుడ్ రీసెంట్ సెన్సేషన్ మిరాయ్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మొదటిరోజే రూ.27 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.91 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో తాజాగా మిరాయ్ సక్సెస్ సెలబ్రషన్స్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ ని మంగళవారం విజయవాడలో నిర్వహించారు. ఎంతో ఘానంగా జరిగిన ఈ ఈవెంట్ కి మిరాయ్ టీంతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా మిరాయ్ లో బ్లాక్ స్వార్డ్ గా కనిపించిన మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే చిరంజీవి కొడుకో, మోహన్ బాబు కొడుకో అవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..”మిరాయ్ సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయానికి ప్రధాన కారణం ప్రేక్షక దేవుళ్ళు. సినిమాలో కంటెంట్ ఉంటే ఆదరిస్తారని మీరు మరోసారి ప్రూవ్ చేశారు. అలాగే, ఈ ఇండస్ట్రీలో ఎదగాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదని మౌళి ప్రూవ్ చేశారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో మౌళి. ఇక్కడ ఎదగాలంటే చిరంజీవి కొడుకో, మోహన్ బాబు కొడుకో అవ్వాల్సిన అవసరం లేదు. యూట్యూబర్ గా మొదలై ఈరోజు ఇంత పెద్ద విజయం సాదించాడంటే మౌళి పట్ల నాకు చాలా గర్వాంగా ఉంది. రేపు నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నన్ను అడుగు. నీకు అండగా నేను ఉంటా. నీ సినిమాలో ఏదైనా క్యారక్టర్ ఇచ్చినా సరే నేను చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్ (Manchu Manoj). ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే మనోజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఒక చాలా సినిమా గురించి అంత పెద్ద స్టేజిపై చెప్పడం నిజంగా చాలా గ్రేట్. నీ మంచితనమే నీ ఆయుధం అన్నా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మిరాయ్ సినిమా విషయానికి వస్తే, తేజ సజ్జా హీరోగా చేసిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరక్కించాడు. మంచు మనోజ్ పవర్ ఫుల్ రోల్ చేసిన ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటించారు.