Bigg Boss 9 Telugu: హీటెక్కిన రెండోవారం నామినేషన్స్.. మాస్క్ మ్యాన్ వీరావేశం.. కౌంటర్ ఇచ్చిన శ్రీజ.. నామినేషన్స్ లో 7 మంది
బిగ్ బాస్ 9 తెలుగులో రెండో వారం నామినేషన్ వాడీవేడిగా జరిగాయి(Bigg Boss 9 Telugu). సోమవారం మొదలైన ఈ నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం కూడా అదే రేంజ్ లో కొనసాగింది.

Bigg Boss Season 9 Second Week Nominations
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగులో రెండో వారం నామినేషన్ వాడీవేడిగా జరిగాయి. సోమవారం మొదలైన ఈ నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం కూడా అదే రేంజ్ లో కొనసాగింది. కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. మధ్యలో కాస్త ఫన్నీగా, కొన్నిసార్లు ఆవేశంగా వాదనలు జరిగాయి. ఏదైతేనేం.. చూసే ఆడియన్స్ కు మాత్రం వినోదాన్ని పంచాయి. ఇక మంగళవారం మొదలైన ఎపిసోడ్ లో ముందుగా రాము రాథోడ్.. కళ్యాణ్ యాటిట్యూడ్ తనకు నచ్చడం లేదని నామినేట్ చేశాడు. ఈ విషయంలో ఇద్దరు కాసేపు వాదించుకున్నారు. కళ్యాణ్ ట్రోల్ అవుతావంటూ రాము రాథోడ్ కౌంటర్ ఇచ్చారు. రెండో నామినేషన్‌గా(Bigg Boss 9 Telugu) మాస్క్ మ్యాన్ హరీష్‌ని ఎంచుకున్నాడు.
AR Murugadoss: మహేష్ తో చేస్తాడా.. మళ్ళీ అదే హీరో రిపీట్ అవుతాడా? కన్ఫ్యూజన్ లో మురుగదాస్
తరువాత నామినేట చేయడానికి వచ్చిన ప్రియా.. షాంపూ ఇష్యూ పై ఫ్లోరా షైనీని, ఎగ్ గొడవ కారణంగా భరణిని నామినేట్ చేసింది. తరువాత వచ్చిన రీతూ చౌదరీ.. మిస్టేక్స్ ఒప్పుకొని గివప్ ఇచ్చే వ్యక్తి హౌస్‌లో ఉండాల్సిన అవసరం లేదంటూ హరీష్‌ని నామినేట్ చేసింది. దానికి హరీష్.. ఏడుస్తూ నువ్వే సింపతీ గేమ్ ప్లే చేస్తున్నావ్ అని కామెంట్ చేశాడు. రెండో నామినేషన్‌గా రీతూ ఫ్లోరా చేసింది. దానికి బట్టలు ముట్టుకోకపోవడం, ఫ్రీ బర్డ్ కామెంట్స్ అనే కారణాలు చెప్పింది.
ఇక సుమన్ శెట్టి.. దొంగతనం అంశం పై తనను ప్రియా అడగడం నచ్చలేదని, హౌస్‌లోకి అనుమతించలేదనే కారణంతో మనీష్‌ని నామినేట్ చేశాడు. తరువాత వచ్చిన పవన్ కళ్యాణ్.. థంమ్స్ అప్ ఇష్యూ పై ఫ్లోరాని, ఎగ్ ఇష్యూ పై భరణిని నామినేట్ లో పెట్టాడు. ఇమ్మాన్యుయెల్ వచ్చి.. కెప్టెన్సీ టాస్క్‌లో తన ఓటమికి కారణమయ్యాడని మనీష్‌ని, తనను బాడీ షేమింగ్, రెడ్ ఫ్లవర్ విషయాలను లేవనెత్తి హరీష్ ని నామినేట్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య కూడా చాలా వాగ్వాదం జరిగింది. ఇద్దరు చాలాసేపు గట్టిగట్టిగా అరుచుకున్నారు.
మాస్క్ మ్యాన్ హరీష్.. ఇమ్మాన్యుయెల్, భరణిలను నామినేట్ లో పెట్టాడు. ఇక చివరగా శ్రీజ.. హరీష్, భరణిలను నామినేట్ చేసింది. వాటికి కారణంగా.. హరీష్ ను నీకు హౌస్‌లో ఉండే అవసరం లేదు, వెళ్లిపో అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనిపై హరీష్ కూడా ఘాటుగా స్పందించాడు. తనను దమ్ముంటే బయటికి పంపించండి అంటూ అరిచాడు. ఇక భరణి.. పవన్, ప్రియా లను, కళ్యాణ్.. భరణి, హరీష్‌లను, ఫ్లోరా.. పవన్, తనూజలను సిల్లీ కారణాలతో నామినేట్ చేసుకున్నారు. ఇక మంగళవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసే సరికి.. హరీష్, పవన్ కళ్యాణ్, భరణి, ప్రియా, ఫ్లోరా సైనీ, మనీష్, సుమన్ శెట్టి నామినేషన్స్ లో ఉన్నారు.