Manchu Manoj
Manchu Manoj : తేజ సజ్జ, మంచు మనోజ్ మెయిన్ లీడ్స్ లో నటించిన మిరాయ్ సినిమా నేడు రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో మనోజ్ విలన్ గా అదరగొట్టేసాడు. మనోజ్ స్టైలిష్ విలన్ పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. దీంతో మిరాయ్ మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో చేసుకున్న సెలబ్రేషన్స్ వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో వైరల్ గా మారింది.(Manchu Manoj)
గత కొన్ని రోజుల క్రితం వరకు మంచు ఫ్యామిలిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ గొడవలతో మోహన్ బాబు, మనోజ్, విష్ణు రోడ్డెక్కారు, పోలీస్ స్టేషన్ కి, కలక్టరేట్ కి కూడా వెళ్లారు. మంచు ఫ్యామిలీ గొడవలు కొన్నాళ్ళు రోజూ వార్తల్లో నిలిచాయి. ఆ సమయంలో మనోజ్ తల్లి కూడా మనోజ్ కి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేడు మనోజ్ షేర్ చేసిన వీడియోలో మనోజ్ తల్లి నిర్మల దేవి కూడా ఉన్నారు.
Also Read : Sai Pallavi : ‘రామాయణ’ కంటే ముందే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. ఫస్ట్ సినిమా రిలీజ్ ఎప్పుడు? ఏ హీరోతో?
మనోజ్ తన ఫ్యామిలీతో కలిసి మిరాయ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ వీడియోలో మనోజ్ తన తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే తన భార్య భూమా మౌనిక, కూతురు దేవసేన కూడా ఉన్నారు. మనోజ్ ఫ్రెండ్స్, తన అభిమానులు, స్టాఫ్ కూడా వచ్చి మిరాయ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారు.
ఇన్ని గొడవల తర్వాత మనోజ్ మొదటి సారి తల్లితో కనబడటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అలాగే ఇవాళ ఉదయం మంచు విష్ణు కూడా మిరాయ్ కి విషెస్ తెలపడం, మనోజ్ దానికి థ్యాంక్స్ అన్న అంటూ రిప్లై ఇవ్వడంతో మంచు కుటుంబలో విబేధాలు తొలిగిపోయాయా, అందరూ ఒక్కటయ్యారా అని నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also See : Ruhani Sharma : బ్రదర్ బర్త్ డే.. స్పెషల్ క్యూట్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్..
మంచు మనోజ్ ఫ్యామిలీతో చేసుకున్న సక్సెస్ సెలబ్రేషన్స్ వీడియో మీరు కూడా చూసేయండి..