Manchu Manoj : ‘మిరాయ్’ సినిమాకు మంచు మనోజ్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు తెలుసా? తేజ సజ్జ కంటే ఎక్కువ?

కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ ఇటీవల భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. (Manchu Manoj)

Manchu Manoj

Manchu Manoj : తేజ సజ్జ హీరోగా మంచు మనోజ్ విలన్ గా తెరకెక్కిన మిరాయ్ సినిమా ఇటీవల రిలీజయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా 81 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కి దగ్గర్లో ఉంది. మిరాయ్ సినిమాని 60 కోట్లతో తీశారు. అయితే ఈ సినిమాలో మీడియం రేంజ్ స్టార్స్ ఉండటంతో ఆర్టిస్ట్ రెమ్యునరేషన్స్ తక్కువే అయ్యాయి అని సమాచారం.

గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ ఇటీవల భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ మొదట రీ ఎంట్రీ కోసం ఒప్పుకున్న సినిమా మాత్రం మిరాయ్ అని మనోజ్ స్వయంగా చెప్పాడు. అయితే మనోజ్ మార్కెట్లో లేడు, మనోజ్ కి హిట్స్ లేవు, అందులోను విలన్ పాత్ర కదా అని తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారు అని అంతా అనుకున్నారు.

Also See : Sonarika Bhadoria : తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తతో కలిసి బేబీ బంప్ ఫొటోలు..

టాలీవుడ్ సమాచారం ప్రకారం మంచు మనోజ్ కు మిరాయ్ సినిమాకు గాను 2 కోట్ల 75 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇటీవల మిరాయ్ సక్సెస్ మీట్ లో కూడా మనోజ్ మాట్లాడుతూ ఈ సినిమా వల్లే నేను నా పిల్లల్ని నాలాగా మంచిగా, అన్ని సౌకర్యాలతో పెంచగలుగుతాను అనే నమ్మకం వచ్చింది అంటూ ఎమోషనల్ కూడా అయ్యాడు. ఈ సినిమాతో మంచి రెమ్యునరేషన్ తీసుకోవడమే కాక తన నటనతో మరోసారి మెప్పించాడు, మరిన్ని అవకాశాలు పొందుతున్నాడు మనోజ్.

మిరాయ్ ముందు వచ్చిన భైరవం సినిమాకు మనోజ్ 2 కోట్లు తీసుకున్నాడని టాక్. ఇక మిరాయ్ సినిమాకు తేజ సజ్జ కేవలం 2 కోట్లు తీసుకున్నాడని తెలుస్తుంది. ఇటీవల మార్కెట్ లేకపోయినా సినిమాలో కంటెంట్ లేకపోయినా ఏడెనిమిది కోట్లు తీసుకునే హీరోలు ఉన్న ఈ రోజుల్లో మార్కెట్ ఉండి, మంచి సినిమా తీస్తూ కూడా కేవలం 2 కోట్లే తీసుకోవడంతో తేజ సజ్జని అభినందిస్తున్నారు.

Also Read : Mirai Collections : అదరగొడుతున్న ‘మిరాయ్’.. మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు..? బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకెంత కావాలి?

మిరాయ్ విజువల్స్, గ్రాఫిక్స్ ని అందరూ పొగుడుతున్నారు. దీంతో ఇలా బడ్జెట్ ఆర్టిస్టుల మీద కాకుండా సినిమా మేకింగ్ లో పెడితే మంచి అవుట్ పుట్స్ వస్తాయని నెటిజన్లు, సినిమా లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రియకు 2 కోట్లు ఇవ్వగా జగపతి బాబు, జయరాం, రితిక నాయక్ లకు 50 లక్షల లోపే రెమ్యునరేషన్ ఇచ్చారట.