Manchu Manoj To Share Some Exciting News Tomorrow
Manchu Manoj: మంచు హీరో మనోజ్ గతకొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత మంచు మనోజ్ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టనున్నాడనని సన్నిహితులు తెలిపారు. అదే విధంగా ఆయన ఓ పాన్ ఇండియా మూవీని కూడా అనౌన్స్ చేశాడు. కానీ, ఆ సినిమా సంగతి ఇప్పుడు అందరూ మర్చిపోయారు. అయితే గతకొద్ది రోజులుగా మంచు మనోజ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని.. త్వరలోనే ఆమెతో పెళ్లి పీటలెక్కబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ వస్తోంది.
Manchu Manoj: జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నా.. మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరని అనుకుంటున్నారా.. దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనికతో మంచు మనోజ్ గతకొద్ది రోజులుగా చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. అడపాదడపా వీరిద్దరు మీడియా కంటికి కలిసి చిక్కారు. అయితే ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. తాజాగా మంచు మనోజ్ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఓ అదిరిపోయే ట్వీట్ చేశాడు. ‘‘ముహూర్తం ఫిక్స్ అయ్యింది.. రేపు ఉదయం 9.45 గంటలకు మీకు గుడ్ న్యూస్ చెబుతాను’’ అంటూ ఓ ట్వీట్ చేశాడు.
దీంతో మనోజ్, మౌనికల వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు ఓకే చెప్పారని.. అందుకే వారి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని.. అదే విషయాన్ని మంచు మనోజ్ రేపు అధికారికంగా ప్రకటించనున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి రేపు పొద్దున మంచు మనోజ్ చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏమిటా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా మంచు మనోజ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Muhurtham fix 🙂
Tomorrow 9:45 AM ??❤️ can’t wait to share ?? https://t.co/pZGAsfK3xk— Manoj Manchu??❤️ (@HeroManoj1) January 19, 2023