Site icon 10TV Telugu

Kannappa OTT Release : కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారిక ప్రకటన

Kannappa Movie

Kannappa: మంచు విష్ణు ప్రధాన పాత్రలో భారీ తారాగణంతో రూపొందిన చిత్రం కన్నప్ప. ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ తదితర నటీనటుల అతిథి పాత్రల్లో మెరిశారు. మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే మంచు విష్ణు అందించారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన కన్నప్ప జూన్ 27న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు కన్నప్ప ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి కన్నప్ప స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో తెలియజేశారు.

పరమ శివ భక్తుడైన తిన్నడు జీవిత కథ ఆధారంగా కన్నప్ప చిత్రం తెరకెక్కింది.విష్ణు టైటిల్ రోల్ ప్లే చేశారు. రుద్రగా ప్రభాస్, కిరాతుడిగా మోహన్ లాల్, శివ పార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ యాక్ట్ చేశారు. సినిమాలో చివరి 40 నిమిషాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. విష్ణు నటన, స్క్రీన్ ప్రజెన్స్ ప్రశంసలు అందుకుంది.

Also Read: ఇందుకే కదా మలయాళం సినిమాలని పొగిడేది.. జస్ట్ 30 కోట్ల బడ్జెట్.. భారీ విజువల్స్.. కలెక్షన్స్ అదుర్స్..

 

Exit mobile version