HBD విష్ణు.. ‘మోసగాళ్లు’ ఫస్ట్ లుక్ రిలీజ్

  • Publish Date - November 23, 2019 / 02:20 AM IST

హ్యపీ బర్త్ డే విష్ణు..ఈ రోజు (నవంబర్ 23, 2019)మంచు విష్ణు 38వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ‘మోసగాళ్లు’ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ను విడుద‌ల చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాలో విష్ణు ‘అర్జున్’ అనే పాత్రలో కనిపిస్తారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతకంపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు.

ఇక జెఫ్రీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్, రుహానీ శర్మ, బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  

ఇక ఐటీ రంగంలో జరిగిన భారీ కుంభకోణం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ఆ కుంభకోణంలో మోసగాళ్లు ఎవరు? వాళ్లు ఏం చేశారు? అనేది ట్విస్ట్. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.