Prabhas – Vishnu : కన్నప్ప కోసం ప్రభాస్ ని ఎలా ఒప్పించాడు.. మా నాన్న ప్రభాస్ ఎంత క్లోజ్ అంటే.. విష్ణు కామెంట్స్

మంచు విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కన్నప్ప గురించి మాట్లాడాడు.

Manchu Vishnu Comments on how he Cast Prabhas and Akashay Kumar in Kannappa

Prabhas – Vishnu : మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్టు కన్నప్ప సినిమా అని దాన్ని భారీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.

ప్రస్తుతం కన్నప్ప సినిమా చివరి దశ షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమా ఆల్మోస్ట్ న్యూజిలాండ్ లోనే షూటింగ్ చేస్తున్నారు. కన్నప్ప సినిమా ఏప్రిల్ 25, 2025న రిలీజ్ అవుతుందని ఆల్రెడీ ప్రకటించారు. అయితే గత కొన్నాళ్లుగా మంచు కుటుంబం వర్సెస్ మంచు మనోజ్ అని గొడవలతో వార్తల్లో నిలుస్తుంది.

Also Read : Child Artist Revanth : జనసేనకు చేసిన ప్రచారం చూసి.. ఈ బుడ్డోడికి సినిమాలో ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి..

ఈ క్రమంలో మంచు విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కన్నప్ప గురించి మాట్లాడాడు. కన్నప్పలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ని ఎలా ఒప్పించాడో తెలిపాడు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ నాకు బాగా క్లోజ్. కానీ మా నాన్నకు ఇంకా క్లోజ్. నాన్న ‘మా’ ప్రసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రభాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా కూడా చేసాడు. బుజ్జిగాడు సమయంలో నాన్న, ప్రభాస్ బాగా క్లోజ్ అయ్యారు. ఎంతంటే ఒకరిని ఒకరు బావ అని పిలుచుకుంటారు. ప్రభాస్ ఈ సినిమా చేయడానికి కారణం నాన్నే. నాన్న అడగ్గానే ప్రభాస్ ఒప్పుకున్నారు అని తెలిపాడు.

ఇక అక్షయ్ కుమార్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో శివుడి పాత్ర ఆయనది. మొదట ఓ తమిళ హీరో అనుకున్నాము కానీ కుదరలేదు. తర్వాత అక్షయ్ కుమార్ గారిని చాలా ట్రై చేసాము కానీ వర్కౌట్ అవ్వలేదు. అసలు ఆయనతో మాట్లాడే ఛాన్స్ కూడా రాలేదు. వాళ్ళ మేనేజర్ ని అయితే తిట్టేసాను కూడా నేను. అతనే అక్షయ్ కుమార్ ఇలాంటి గెస్ట్ పాత్ర చేయడు అని చెప్పేస్తున్నాడు. మా నాన్న డైరెక్టర్ సుధా కొంగర క్లోజ్. సుధా అక్షయ్ తో ఆకాశమే నీ హద్దురా రీమేక్ చేస్తుంది. దాంతో ఆమె ద్వారా అక్షయ్ కి పాత్ర గురించి చెప్తే నన్ను కాల్ చేయమన్నారు, న్యూజిలాండ్ లో షూట్ నుంచి నేను అక్షయ్ కి కాల్ చేసి కథ ఫోన్ లో చెప్పి శివుడి పాత్ర గురించి చెప్పడంతో ఆయన శివుడి భక్తుడని చెప్పి ఒప్పుకున్నారని తెలిపాడు విష్ణు.

Also Read : HariHara VeeraMallu : పవన్ హరిహర వీరమల్లు మరోసారి వాయిదా..? ఆ రెండు సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో..

ఇక మోహన్ లాల్ గారు నాన్నకు బాగా క్లోజ్ నేనే వెళ్లి ఆయన్ని అడగ్గానే వెంటనే ఒప్పుకున్నారని చెప్పాడు. సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారని, మోహన్ బాబు ది కూడా పెద్ద క్యారెక్టర్ అని చెప్పాడు విష్ణు. మరి కన్నప్ప సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.