Child Artist Revanth : జనసేనకు చేసిన ప్రచారం చూసి.. ఈ బుడ్డోడికి సినిమాలో ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి..

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కొడుకుగా చేసిన బుల్లిరాజు అనే పాత్ర బాగా పేలింది.

Child Artist Revanth : జనసేనకు చేసిన ప్రచారం చూసి.. ఈ బుడ్డోడికి సినిమాలో ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి..

Do You Know About Sankranthiki Vasthunnam Movie Child Artist Bulli Raju Details Here

Updated On : January 19, 2025 / 12:54 PM IST

Child Artist Revanth : ఇటీవల సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో భార్య, మాజీ ప్రేయసి పాత్రలో మాజీ పోలీసాఫీసర్ ఎలా నలిగిపోయాడు అనే కథాంశంతో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయి పెద్ద హిట్ అయింది ఈ సినిమా. ఇంకా థియేటర్స్ లో హౌస్ ఫుల్ తో నడుస్తుంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కొడుకుగా చేసిన బుల్లిరాజు అనే పాత్ర బాగా పేలింది. వెంకటేష్ ని సినిమాలో ఎవరైనా తిడితే ఇతను వాళ్ళను తిట్టే పాత్రలో ఫుల్ కామెడీ వచ్చింది. ఓటీటీలు చూసి ఇప్పటి పిల్లలు ఎలా చెడిపోతున్నారు అని ఒక మంచి మెసేజ్ కూడా ఈ పిల్లాడి పాత్రతో చెప్పించారు. ప్రేక్షకులు అంతా సినిమాలో బుల్లి రాజు పాత్రకు ఫ్యాన్ అయిపోతున్నారు. దీంతో ఈ బుడ్డోడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

Also Read : HariHara VeeraMallu : పవన్ హరిహర వీరమల్లు మరోసారి వాయిదా..? ఆ రెండు సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో..

దీంతో పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈ బుడ్డోడు. ఇతని అసలు పేరు రేవంత్. భీమవరం దగ్గర గణపవరం వీళ్ళ సొంతూరు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతనికి ఈ సినిమాలో ఎలా ఛాన్స్ వచ్చిందో తెలిపాడు. చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ మాట్లాడుతూ.. మాది భీమవరం దగ్గర గణపవరం. నేను 5th క్లాస్ చదువుతున్నాను. పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్. ఎన్నికల సమయంలో జనసేనకు క్యాంపైన్ చేశాను. అన్ని ఇళ్లకు బ్యాలెట్ బాక్స్ పట్టుకొని ఓటు వేయాలని తిరిగాను. నేను అలా తిరిగింది వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే అది అనిల్ రావిపూడి గారు చూసి నన్ను ఆడిషన్ కి పిలిచారు. అలా నేను ఈ మూవీలో సెలెక్ట్ అయ్యాను అని తెలిపాడు. రేవంత్ గతంలో కూటమికి ప్రచారం చేసిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ సినిమా గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో జరగడంతో అక్కడి బాబు అయితేనే బాగుంటుంది అని వెతికి ఈ బుడ్డోడిని అనిల్ రావిపూడి, అతని టీమ్ పట్టుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ బుడ్డోడి క్యారెక్టర్ బాగా పేలి స్టార్ అయిపోయాడు. మరి భవిష్యత్తులో ఇంకెన్ని సినిమా ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా నాలుగు రోజుల్లో 131 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇప్పటికే అన్నిచోట్లా బ్రేక్ ఈవెన్ అయి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది. ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు మూవీ యూనిట్.

Also Read : MAD Square : సూపర్ హిట్ మ్యాడ్ సీక్వెల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్.. మ్యాడ్ స్క్వేర్ ఎప్పుడంటే?