MAD Square : సూపర్ హిట్ మ్యాడ్ సీక్వెల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్.. మ్యాడ్ స్క్వేర్ ఎప్పుడంటే?

ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ సినిమా నుంచి రెండు పాటలు వచ్చి మంచి హిట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

MAD Square : సూపర్ హిట్ మ్యాడ్ సీక్వెల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్.. మ్యాడ్ స్క్వేర్ ఎప్పుడంటే?

Super hit Movie Mad Sequel Mad Square Release Date Announced

Updated On : January 18, 2025 / 5:46 PM IST

MAD Square : అందరూ కొత్తవాళ్లతో 2023లో వచ్చిన మ్యాడ్ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా ఓ కాలేజీ విద్యార్థులు కథను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చెప్పడంతో ఈ సినిమా అందరికి నచ్చేసి పెద్ద హిట్ అయి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ గతంలోనే ప్రకటించి మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ పెట్టారు.

Also Read : Manchu Vishnu : మా నాన్న మనుసు విరిగిపోయింది.. అమ్మ కొడుతుందని భయపడుతున్నా.. మనోజ్ తో గొడవపై విష్ణు కామెంట్స్..

ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ సినిమా నుంచి రెండు పాటలు వచ్చి మంచి హిట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా 2025 మార్చి 29న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఉన్న నలుగురు మెయిన్ అబ్బాయిల పాత్రలతో ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. మీరు హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ వినోదం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మ్యాడ్ నెస్ అని తెలిపారు.

Super hit Movie Mad Sequel Mad Square Release Date Announced

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే మార్చ్ 28 హరిహర వీరమల్లు సినిమా ప్రకటించారు. ఈ సినిమా మార్చ్ 29 అని అనౌన్స్ చేయడంతో హరిహర వీరమల్లు వాయిదా పడుతుందని భావిస్తున్నారు.

 

Also Read : Dilruba Song : కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..