Manchu Vishnu : మా నాన్న మనుసు విరిగిపోయింది.. అమ్మ కొడుతుందని భయపడుతున్నా.. మనోజ్ తో గొడవపై విష్ణు కామెంట్స్..
తాజాగా ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ గొడవపై మాట్లాడాడు.

Manchu Vishnu Comments on Issue with Manoj
Manchu Vishnu : గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవ సాగుతున్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ అంతా ఒకవైపు, మనోజ్ ఒక్కడు ఒకవైపు అన్నట్టు ఈ గొడవలు సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు, ఆఖరికి కలెక్టర్ కి కూడా ఫిర్యాదులు చేశారు. ఇవి ఆస్తి తగాదాలు అని పలువురు అంటున్నా మనోజ్ మాత్రం ఇవి ఆస్తి గొడవలు కాదు అని అంటున్నాడు.
అయితే తాజాగా ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ గొడవపై మాట్లాడాడు. కానీ ఈ గొడవలు ఎందుకు, ఏంటి అని మాత్రం చెప్పలేదు. ఇంటి గొడవ బయటకి వెళ్లి వార్తల్లో నిలిచింది, పోలీస్ కేసు అయింది, ఇండస్ట్రీ పెద్దలు కూడా ఎవరూ మాట్లాడలేదా అని హోస్ట్ అడిగారు.
Also Read : Dilruba Song : కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
దీనికి మంచు విష్ణు సమాధానమిస్తూ.. సినీ పరిశ్రమ నా ఫ్యామిలీ. బయటకు ఎవరూ వచ్చి మాట్లాడలేదు. కానీ కొంతమంది పర్సనల్ గా మాట్లాడారు. బయటకు వచ్చి మాట్లాడితే ఇష్యూ మరింత పెద్దది అవుతుంది. అందరి ఇంట్లో గొడవలు ఉన్నాయి. కొంతమంది ఫోన్స్ చేసి మాట్లాడారు. ఇండస్ట్రీ పెద్దగా నాన్న ఉండి అందరి గొడవలు తీరుస్తున్నారు. అలాంటి ఇంట్లో గొడవ జరిగితే ఎలా తీర్చాలో ఎవరికీ అర్ధం కాలేదు. నాకు అన్ని పరిశ్రమలలో ఫ్రెండ్స్ ఉన్నారు. మోహన్ లాల్ గారు కాల్ చేసి రమ్మంటావా అని అడిగారు. చాలా మంది ఫోన్ చేసి అడిగారు ఈ గొడవ గురించి. ఈ విషయంలో నాన్న గారి మనసు విరిగిపోయింది. మా అమ్మ నన్ను ఎప్పుడు కొడుతుందా అని భయపడుతున్నాను. నేను ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెట్టట్లేదని మా అమ్మ చూస్తుంది. మా అమ్మ బాగా నలిగిపోయింది ఈ విషయంలో. మా తమ్ముడితో కూడా గొడవ ముగిసిపోతుంది. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఇంటి గొడవ బయటకు వస్తే ఎవరికీ నచ్చదు. మా నాన్న ఇంటి పెద్ద ఆయన చూసుకుంటారు దీని గురించి. నా ఫోకస్ అంతా కన్నప్ప సినిమా గురించే అని తెలిపారు.
ఇలా ఈ వివాదం వల్ల మోహన్ బాబు, విష్ణు తల్లి బాధపడ్డారు అని తెలిపారు కానీ అసలు ఈ వివాదం ఎందుకు అని అడిగితే మాత్రం సమాధానం ఇవ్వలేదు. అయితే నేడు కలెక్టర్ తో మీటింగ్ అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఇవి ఆస్తి గొడవలు కావు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకించినందుకు మా అన్నయ్య మా నాన్నను అడ్డం పెట్టుకొని ఈ నాటకం ఆడుతున్నాడు. నా మీద కేసులు పెట్టిస్తున్నాడు అని అన్నారు.