Dilruba Song : కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.

Kiran Abbavaram Dil Ruba Movie First Song Released Watch Here
Dilruba Song : క సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు దిల్ రూబా సినిమాతో రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో 10వ సినిమాగా తెరకెక్కుతుంది. రుక్సార్ ధిల్లాన్, ఖ్యాతి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, యూడ్లీ ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో విశ్వ కరుణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Manchu Manoj Vs Mohan Babu : కలెక్టర్ వద్దకు చేరిన ‘మంచు’ పంచాయితీ.. మోహన్ బాబు vs మంచు మనోజ్
ఇప్పటికే దిల్ రూబా సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను భాస్కర భట్ల రాయగా సామ్ CS సంగీత దర్శకత్వంలో అనురాగ్ కులకర్ణి పాడారు. మీరు కూడా ‘అగ్గిపుల్ల అలా గీసినట్టు..’ అంటూ సాగే ఈ మెలోడీ పాటను వినేయండి..
ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున విడుదల కానుంది.