Manchu Manoj Vs Mohan Babu : కలెక్టర్ వద్దకు చేరిన ‘మంచు’ పంచాయితీ.. మోహన్ బాబు vs మంచు మనోజ్

గత కొన్నాళ్లుగా సైలెంట్ అయింది అనుకున్న మంచు కుటుంబం పంచాయితీ ఇటీవల పండగ నుంచి మళ్ళీ మొదలైంది.

Manchu Manoj Vs Mohan Babu : కలెక్టర్ వద్దకు చేరిన ‘మంచు’ పంచాయితీ.. మోహన్ బాబు vs మంచు మనోజ్

Manchu Manoj Vs Mohan Babu Complaint at Rangareddy Collectorate

Updated On : January 18, 2025 / 4:29 PM IST

Manchu Manoj Vs Mohan Babu : గత కొన్నాళ్లుగా సైలెంట్ అయింది అనుకున్న మంచు కుటుంబం పంచాయితీ ఇటీవల పండగ నుంచి మళ్ళీ మొదలైంది. ఇటీవల సంక్రాంతి పండగ పూట తిరుపతిలో మోహన్ బాబు, విష్ణు ఫ్యామిలీతో తమ యూనివర్సిటీకి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోడానికి వెళ్లగా అక్కడకు మనోజ్ వెళ్లి తన తాతకు నివాళులు అర్పించి వెళ్ళిపోతాను అని చెప్పినా లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మనోజ్ కు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తిరుపతి పంచాయితీ అవ్వకముందే మంచు పంచాయితీ నేడు రంగారెడ్డి కలెక్టరేట్ కి చేరింది.

రంగారెడ్డి కలెక్టర్ కు మోహన్ బాబు జల్ పల్లిలోని తన ఇంటిని కొంతమంది ఆక్రమించారు అని ఫిర్యాదు చేసి ఇంట్లో వాళ్ళను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆ ఇంట్లో ఉన్నది మంచు మనోజ్ కావడం గమనార్హం. దీంతో మోహన్ బాబు ఫిర్యాదుతో జల్ పల్లి ఇంట్లో ఉంటున్న మనోజ్ కు కలెక్టర్ నోటీసులు పంపించారు.

Also Read : TG Vishwa Prasad : పవన్ ప్రోత్సాహంతో ఏపీలో 13 వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్న టాలీవుడ్ నిర్మాత.. ఓర్వకల్లు దగ్గర ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్..

ఈ క్రమంలో మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ కు వెళ్లి కలెక్టర్ ప్రతిమా సింగ్ తో మాట్లాడారు. అలాగే తమ కుటుంబ ఆస్తుల వివాదానికి సంబంధించి కూడా కలెక్టర్ తో మాట్లాడి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వర్సెస్ మంచు మనోజ్ అని గొడవ సాగుతున్న సంగతి తెలిసిందే. ఆస్తుల విషయంలోనే ఈ వివాదం నెలకొందని సమాచారం. ఓ పక్క పోలీసులకు, కలెక్టర్ కు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు ఇచ్చుకుంటూనే మరో పక్క మంచు మనోజ్, మంచు విష్ణు సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా తిట్టుకుంటూ ట్వీట్స్ వేస్తున్నారు.

దీంతో మంచు కుటుంబ పంచాయితీ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఫ్యామిలీ వివాదంపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇంకెన్ని రోజులు ఈ పంచాయితీ సాగుతుందో చూడాలి.

Chiranjeevi-Thaman : చిరంజీవి ట్వీట్‌కు త‌మ‌న్ రిప్లై.. ఒక్కోసారి ఆవేదన..