Chiranjeevi-Thaman : చిరంజీవి ట్వీట్‌కు త‌మ‌న్ రిప్లై.. ఒక్కోసారి ఆవేదన..

చిరు మాట‌ల‌కు త‌మ‌న్ రిప్లై ఇచ్చారు.

Chiranjeevi-Thaman : చిరంజీవి ట్వీట్‌కు త‌మ‌న్ రిప్లై.. ఒక్కోసారి ఆవేదన..

Thaman responded on Chiranjeevi tweet

Updated On : January 18, 2025 / 3:08 PM IST

సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ డాకు మ‌హారాజ్ స‌క్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. సోష‌ల్ మీడియా నెగిటివిటీ సినిమా పై తీవ్ర ప్ర‌భావం చేపిస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. త‌మ‌న్ మాట‌లు హృద‌యాన్ని తాకేలా ఉన్నాయ‌న్నారు. మ‌న‌సు ఎంత క‌ల‌త చెందితే అంత‌లా మాట్లాడాడు అనే విష‌యం అర్థం అవుతుంద‌ని చిరు అన్నారు. తాజాగా చిరు మాట‌ల‌కు త‌మ‌న్ రిప్లై ఇచ్చారు.

ఎంత కాదనుకున్నా మ‌నం మ‌నుషులమే క‌దా.. ఒక్కోసారి ఆవేద‌న గుండె త‌లుపులు దాటి వ‌చ్చేస్తూ ఉంటుంద‌న్నారు. ‘డియర్ అన్నయ్యా.. మీ మాటలు నాకు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన..! భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. నన్ను అర్థం చేసుకొని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తు ఉంటాయి.’ అని అన్నారు.

Robinhood release date : పవ‌న్ క‌ళ్యాణ్‌కు పోటీగా నితిన్‌.. ‘రాబిన్‌ హుడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

చిరంజీవి ఏమ‌న్నారంటే?

నిన్న త‌మ‌న్ మాట్లాడిన మాట‌లు హృద‌యాల్ని తాకేలా ఉన్నాయ‌ని చిరు అన్నారు. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే త‌మ‌న్‌లో ఇంత ఆవేదన వుండడం ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించిందన్నారు. నువ్వింత‌గా స్పందిచావు అంటే నీ మ‌న‌సు ఎంత క‌ల‌త చెందిందో. విష‌యం ఏదైనా స‌రే సోష‌ల్ మీడియా వాడుతున్న ప్ర‌తి ఒక్క‌రి మాట‌ల తాలూకు ప్ర‌భావం ఆయా వ్య‌క్తుల మీ ఎలా ఉంటుందో ఆలోచించాల‌న్నారు. ఎవ‌రో అన్న‌ట్లుగా మాట‌లు ఉచిత‌మే. అయితే.. ఆ మాట‌లు మ‌రొక‌రిలో స్ఫూర్తి నింపుతాయ‌న్నారు. అలాగే ఇంకొక‌రి జీవితాన్ని నాశ‌నం చేస్తాయ‌న్నారు. దేన్ని ఎంచుకుంటామ‌నేది ముఖ్యం. మ‌నం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎన‌ర్జీ మ‌న జీవితాల‌ను కూడా పాజిటివ్‌గా ముందుకు న‌డిపిస్తుంద‌న్నారు.