Robinhood release date : పవన్ కళ్యాణ్‌కు పోటీగా నితిన్.. ‘రాబిన్ హుడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..
రాబిన్‌హుడ్ మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.

Nithiin Robinhood release date fix
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలీల కథానాయిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ ఏడాది మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది.
వాస్తవానికి ఈ చిత్రం గత ఏడాది క్రిస్మస్ సందర్బంగా విడుదల కావాల్సి ఉంది. కాగా.. కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అప్పట్లో చిత్ర బృందం తెలిపింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది.
Manchu Manoj : నేనొక్కడినే వస్తా.. కూర్చోని మాట్లాడుకుందాం.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్..
అయితే.. మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ కి భక్తుడిని అని నితిన్ చెప్పుకుంటారు. అంతగా పవన్ ని అడ్మైర్ చేసే నితిన్ .. పవన్ కళ్యాణ్‌తో పోటీపడడానికి సిద్ధపడడం గమనార్హం.
కాగా.. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున వస్తాయా? పవన్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉండడంతోనే నితిన్ తన సినిమాని ఈ తేదీకి విడుదల చేస్తున్నాడా? అన్నది చూడాల్సి ఉంది.
ROBINHOOD from MARCH 28th 💥💥💥 @VenkyKudumula pic.twitter.com/CYFmbfgWRm
— nithiin (@actor_nithiin) January 18, 2025