Manchu Manoj : నేనొక్క‌డినే వ‌స్తా.. కూర్చోని మాట్లాడుకుందాం.. మంచు మ‌నోజ్ పోస్ట్ వైర‌ల్..

మంచు కుటుంబంలో వివాదాల వేళ మంచు మనోజ్‌ పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

Manchu Manoj : నేనొక్క‌డినే వ‌స్తా.. కూర్చోని మాట్లాడుకుందాం.. మంచు మ‌నోజ్ పోస్ట్ వైర‌ల్..

Manchu Family Dispute Manchu Manoj tweet viral

Updated On : January 18, 2025 / 11:52 AM IST

మంచు కుటుంబంలో వివాదాల వేళ మంచు మనోజ్‌ పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. మ‌నం క‌లిసి కూర్చోని మాట్లాడుకుందాం, నేను ఒక్క‌డినే వ‌స్తాను అని మాట ఇస్తున్నాను అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

‘కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు మిగిలిన అంద‌రిని ప‌క్క‌న పెట్టి మ‌నం మాట్లాడుకుందాం. ఏమ‌ని అంటావు? నేను ఒక్క‌డినే వ‌స్తాను అని నీకు మాట ఇస్తున్నాను. నీకు కావాలంటే నువ్వు ఎవ‌రినైనా తీసుకురావొచ్చు లేదా మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ చేద్దాం. ఇట్లు నీ క‌రెంట్ తీగ.’ అంటూ మంచు మ‌నోజ్ పోస్ట్ చేశారు.

Saif Ali Khan Attack: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కరీనా ఏం చెప్పిందంటే?

మంచు మ‌నోజ్ ఎవ్వ‌రి పేరును నేరుగా చెప్ప‌లేదు. అయిన‌ప్ప‌టికి ఇది త‌న సోద‌రుడు విష్ణును ఉద్దేశించే పెట్టాడ‌ని నెటిజ‌న్లు అనుకుంటున్నారు.

కాగా.. నిన్న కూడా మ‌నోజ్ ఓ పోస్ట్ పెట్టాడు. కన్నప్పలో రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజులాగా.. సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్‌ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని అన్నాడు.

సంక్రాంతి స‌మ‌యంలో మంచు కుటుంబంలో వివాదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని కుటుంబ పెద్ద‌ల‌కు నివాళులర్పించేందుకు మోహ‌న్‌బాబు యూనివ‌ర్సిటీకి మ‌నోజ్ దంప‌తులు రాగా అక్క‌డ ఉద్రిక్త‌త చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. యూనివ‌ర్సిటీకి వెళ్లిన‌ప్పుడు జ‌రిగిన ప‌రిణాల‌పై మ‌నోజ్ ఇటీవ‌ల చంద్ర‌గిరి పోలీసుల‌కు రాత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు.

Chiranjeevi : సోషల్ మీడియాలో నెగిటివిటీ.. తమన్ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి..