Chiranjeevi : సోషల్ మీడియాలో నెగిటివిటీ.. తమన్ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి..
తమన్ వ్యాఖ్యలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

Megastar Chiranjeevi respond on Thaman comments On Social Media Negativity
ఇటీవల సోషల్ మీడియా చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. భయమేస్తుంది. మొత్తం నెగిటివిటినే. సినిమా నచ్చకపోతే చెప్పండి కానీ ఇలా నెగిటివిటి చేసి ఏం సాధిస్తారు అంటూ డాకు మహారాజ్ సక్సెస్ మీట్‌లో తమన్ ఎంతో ఆవేదనతో మాట్లాడాడు. తమన్ మాటలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమన్ మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయన్నారు. మనసు ఎంత కలత చెందితే అంతలా మాట్లాడాడు అనే విషయం అర్థమవుతోందన్నారు.
“డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా, మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది.” అని చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
తమన్ ఏమన్నారంటే..?
ఇటీవల కాలంలో మూవీ రిలీజ్ అవ్వకముందే సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేయడం, సినిమాను లీక్ చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాకు చాలా రకాల నెగిటివిటీ వచ్చింది. దీనిపై తమన్ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు. డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్‌లో తమన్ మాట్లాడుతూ.. ఇటీవల రోజుల్లో ఓ మూవీ హిట్ అయిందని చెప్పుకోవడం కష్టంగా మారిందన్నారు. చుట్టూ నెగిటివ్ ట్రోల్స్, ట్యాగ్స్ ఉంటున్నాయి. సోషల్ మీడియా చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది. భయమేస్తుంది. మొత్తం నెగిటివిటినే అని అన్నారు.
మూవీ నచ్చకపోతే చెప్పండి కానీ ఇలా నెగిటివిటి చేసి ఏం సాధిస్తారు అని ప్రశ్నించారు. మీ వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. అందరికి అన్నం పెట్టే దేవుళ్ళు నిర్మాతలు అని చెప్పారు. వాళ్ళు ఎక్కడో ఫైనాన్స్ కి డబ్బులు తెచ్చి మూవీస్ తీస్తున్నారన్నారు. ఇలాగే నెగిటివిటి కంటిన్యూ అయితే మాత్రం భవిష్యత్తులో మూవీస్ తీయడానికి నిర్మాతలు ఉండరేమో అనే భయమేస్తుందన్నారు. అందరు హీరోల ఫ్యాన్స్ కి బాధ్యత ఉందన్నారు. మీరు మీరు కొట్టుకోండి కానీ సినిమాలను నెగిటివ్ చేయకండి అని కోరారు.
Megastar Chiranjeevi : షార్జా స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి సందడి.. వీడియో
Dear @MusicThaman
నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.విషయం సినిమా అయినా క్రికెట్ అయినా
మరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025