Megastar Chiranjeevi : షార్జా స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి సందడి.. వీడియో
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో డీపీ వరల్డ్ ఐఎల్‌టీ20 లీగ్‌లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి.

Megastar Chiranjeevi Watches ILT20 in UAE
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో డీపీ వరల్డ్ ఐఎల్‌టీ20 లీగ్‌లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ లీగ్‌లో మెగాస్టార్ చిరంజీవి తళుక్కున మెరిశారు. షార్జా స్టేడియంలో దుబాయ్ క్యాపిటల్స్, షార్జా వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను మెగాస్టార్ చిరంజీవి, ఐసీసీ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధితో కలిసి వీక్షించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో షై హోప్ (83 నాటౌట్; 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు.
రొవ్‌మెన్ పావెల్ (28), సికిందర్ రజా (27), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (22) లు రాణించారు. షార్జా బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు తీశాడు. మిల్లే, ఆదిల్ రషీద్, కరీమ్ జనత్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని షార్జా జట్టు 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షార్జా బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో (81; 27 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జాన్సన్ చార్లెస్ (37), ల్యూక్ వెల్స్ (31), జేసన్ రాయ్ (26) లు రాణించారు. దుబాయ్ క్యాపిటల్స్ బౌలర్లలో దుష్మంత చమీర మూడు వికెట్లు తీశాడు.
What a moment! 🤩 Megastar Chiranjeevi graced the Sharjah Cricket Stadium, to watch #DPWorldILT20 alongside Mr. Mubashshir Usmani, ICC Director and Chair of Associates, and Kiran Kumar Grandhi, GMR Group Corporate Chairman. ⚡️🤩#DPWorldILT20 #AllInForCricket #EnterTheEpic… pic.twitter.com/6sCj85qE4C
— International League T20 (@ILT20Official) January 17, 2025