Viral Video : సామ్ కాన్‌స్టాస్‌తో సెల్ఫీ దిగాలనుకుంటివా.. ఇప్పుడు చూడు ఏమైందో.. అంత తొందర ఎందుకు గురూ!
సామ్ కాన్‌స్టాస్‌తో సెల్ఫీ కోసం ఓ అభిమాని చేసిన ప్రయత్నం కారు ప్రమాదానికి దారి తీసింది.

Viral video Sam Konstas fan leaves his car handbrake off before going for Aussie openers autograph
క్రికెటర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు కనబడితే చాలు.. చుట్టూ గుమిగూడీ సెల్పీలు, వీడియోలతో తీసుకుంటుంటారు అభిమానులు. అయితే.. ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేశాడు 19 ఏళ్ల సామ్ కాన్‌స్టాస్. రెండు టెస్టు మ్యాచులు ఆడిన అతడు 81.9 స్ట్రైక్‌రేటుతో 113 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. అతడి ఆటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతడు ఆడిన షాట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హేమాహేమీ బ్యాటర్లు సైతం బుమ్రా బౌలింగ్‌లో ఆడేందుకు ఆపసోపాలు పడుతుంటే ఈ కుర్రాడు మాత్రం అలవోకగా ఆడేశాడు. అతడు భవిష్యత్తు ఆసీస్ స్టార్ క్రికెటర్ అంటూ మాజీ ప్రశంసల వర్షం కురించారు.
సామ్ కాన్‌స్టాస్‌తో సెల్ఫీ కోసం..
సామ్ కాన్‌స్టాస్‌తో సెల్ఫీ కోసం ఓ అభిమాని చేసిన ప్రయత్నం కారు ప్రమాదానికి దారి తీసింది. బిగ్‌బాష్ లీగ్ లో సామ్ కాన్‌స్టాస్ సిడ్నీ థండర్ తరుపున ఆడుతున్నాడు. ప్రాక్టీస్ కోసం అతడు మైదానానికి చేరుకున్నాడు. తన కిట్‌ను తీసుకుని రోడ్డు దాటుకుని మైదానంలోకి వెలుతున్నాడు. దీన్ని కారులోంచి వెలుతున్న ఓ వ్యక్తి గమనించాడు. కాన్‌స్టాస్‌తో సెల్పీ దిగాలని అతడు భావించాడు. వెంటనే తన కారును పార్క్ చేసి.. సామ్ వైపుగా వెళ్లాడు.
అయితే.. తొందరలో సదరు వ్యక్తి హ్యాండ్ బ్రేక్‌ని వేయడం మరిచిపోయాడు. ఎత్తులో కారులో పార్క్ చేయడంతో అది కిందకు వచ్చింది. కొంత దూరం వెళ్లి వెనక్కి చూసి తాను చేసిన తప్పును గ్రహించి కారుకు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు అతడు. అయితే.. అప్పటికే ఆలస్యం అయింది. ఆ కారు ముందు పార్క్ చేసిన మరో కారును ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఖరీదైన సెల్పీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
One of the costliest attempts to take a picture with Sam Konstas. 🤣pic.twitter.com/HxnFTivMi0
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2025