Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా..
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.

Smriti Mandhana creates history by hitting fastest ODI century by Indian woman
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీ సాధించింది. వన్డేల్లో మంధానకు ఇది పదో సెంచరీ. ఈ క్రమంలో భారత మహిళల క్రికెట్‌లో వన్డేల్లో 10 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచింది. అంతేకాదండోయ్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా భారత ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది. ఈ మ్యాచ్‌లో మంధాన కేవలం 70 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకుంది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో మంధాన 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు సాధించింది.
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్లు..
స్మృతి మంధాన – 70 బంతుల్లో ఐర్లాండ్ పై (2025లో )
హర్మన్ ప్రీత్ కౌర్ – 87 బంతుల్లో సౌతాఫ్రికా పై (2024లో )
హర్మన్ ప్రీత్ కౌర్ – 90 బంతుల్లో ఆస్ట్రేలియా పై (2017లో )
జెమీమా రోడ్రిక్స్ – 90 బంతుల్లో ఐర్లాండ్ పై (2025లో)
హార్లీన్ డియోల్ – 98 బంతుల్లో వెస్టిండీస్ పై (2024లో)
Kapil Dev – Yograj Singh : యువరాజ్ సింగ్ తండ్రి చేసిన వ్యాఖ్యలపై కపిల్ కామెంట్స్ వైరల్..
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు..
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – 15 సెంచరీలు
సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 13 సెంచరీలు
టామీ బ్యూమాంట్ (ఇంగ్లాండ్)- 10 సెంచరీలు
స్మృతి మంధాన (భారత్) – 10 సెంచరీలు
చమరి ఆటపట్టు (శ్రీలంక) – 9 సెంచరీలు
షార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లాండ్) – 9 సెంచరీలు
నాట్ స్కివర్-బ్రంట్ (ఇంగ్లాండ్) – 9 సెంచరీలు
వన్డేల్లో 500 ఫోర్లు..
ఈ మ్యాచ్‌లో మంధాన 12 ఫోర్లు కొట్టింది. ఈ క్రమంలో వన్డేల్లో 500 ఫోర్లు బాదిన రెండో భారత ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 805 ఫోర్లతో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది.
వన్డేల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్లు..
మిథాలీ రాజ్ (భారత్) – 232 మ్యాచుల్లో 805 ఫోర్లు
షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) – 191 మ్యాచుల్లో 686 ఫోర్లు
సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 168 మ్యాచుల్లో 673 ఫోర్లు
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – 103 మ్యాచుల్లో 572 ఫోర్లు
స్టాఫానీ టేలర్ (వెస్టిండీస్) – 160 మ్యాచుల్లో 546 ఫోర్లు
కేఎల్ రోల్టన్ (ఆస్ట్రేలియా) – 141 మ్యాచుల్లో 529 ఫోర్లు
ఏఈ సాటర్త్‌వైట్ (న్యూజిలాండ్) – 145 మ్యాచుల్లో 514 ఫోర్లు
టీటీ బ్యూమౌంట్ (ఇంగ్లాండ్) – 126 మ్యాచుల్లో 508 ఫోర్లు
స్మృతి మంధాన (భారత్) – 97 మ్యాచుల్లో 500 ఫోర్లు
𝗙𝗮𝘀𝘁𝗲𝘀𝘁 𝗪𝗢𝗗𝗜 💯 𝗳𝗼𝗿 𝗜𝗻𝗱𝗶𝗮 – it took Smriti Mandhana just 70 balls! ⚡️#AaliRe #INDvIRE pic.twitter.com/CQwKqtiu6d
— Mumbai Indians (@mipaltan) January 15, 2025