Kapil Dev – Yograj Singh : యువరాజ్ సింగ్ తండ్రి చేసిన వ్యాఖ్యలపై కపిల్ కామెంట్స్ వైరల్..
కపిల్ దేవ్ పై టీమ్ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ తండ్రి మోగ్‌రాజ్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు.

Kapil blunt reaction to Yograj Singh recent controversial comments
భారతదేశానికి తొలి వరల్డ్ కప్‌ను అందించి హీరో అయ్యాడు కపిల్ దేవ్. 1983లో భారత జట్టు కపిల్ దేవ్ నాయకత్వంలోనే తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. కాగా.. కపిల్ దేవ్ పై టీమ్ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ తండ్రి మోగ్‌రాజ్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తనను దేశవాళీలో జట్టు నుంచి తప్పించడం వెనుక కపిల్ కీలక పాత్ర పోషించాడని అన్నారు. దీంతో అతడి చంపేందుకు పిస్టల్‌ను తీసుకువెళ్లినట్లు యోగ్‌రాజ్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కపిల్ దేవ్ స్పందించారు.
పంజాబ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కపిల్ దేవ్ హాజరు అయ్యారు. ఈ క్రమంలో అక్కడ మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు ఆయన్ను అడిగారు. యోగ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. అతడు ఎవరు అని అన్నారు. యువరాజ్ సింగ్ తండ్రి అంటూ అక్కడ ఉన్న వారు చెప్పగా.. ఒకే ఇంతకు మించి ఏమైనా ఉందా? మరేవైనా ప్రశ్నలు ఉండే అడగండి అంటూ కపిల్ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మోగ్‌రాజ్ ఏమన్నారంటే..?
ఇటీవల యోగ్‌రాజ్ ఓ షోలో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశాడు. కపిల్ దేవ్ భారత జట్టుకు, నార్త్ జోన్, హరియాణాకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు తనను ఎలాంటి కారణం లేకుండానే తప్పించారని యోగ్‌రాజ్ అన్నాడు. అలా ఎందుకు తనను తప్పించారో అడగాలని నా భార్య (షబ్నం) నాకు చెప్పింది. అప్పుడు తాను అతడికి ఓ గుణపాఠం చెబుతానని అన్నాను.
ఓ పిస్టల్ తీసుకుని కపిల్ ఇంటికి వెళ్లాను. అదే సమయంలో అతడు తన తల్లితో కలిసి బయటకు వచ్చాడు. అతడిని నేను తిట్టాను. నీ వల్ల నా స్నేహితుడిని కోల్పోయాను. ఇందుకు నీవు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటావని హెచ్చరించాను. నీ తల మీద తుపాకీ పెట్టి ఇప్పటికిప్పుడు పేల్చేసేవాడిని. కానీ అలా చేయకపోవడానికి ఓ కారణం ఉంది. మీ అమ్మగారి వల్లే నీవు బతికి పోయావు. నీ వెనుక ఆమె ఉంది. అందుకే వదిలేస్తున్నా అని అతడితో చెప్పి షబ్నంను తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాను అని యోగ్‌రాజ్ అన్నాడు.
BCCI : ఆసీస్ పర్యటనలో ఓటమి.. బీసీసీఐ కొత్త, కఠిన నిబంధనలు..! ప్లేయర్లకు భారీ షాక్..
యోగ్‌రాజ్ 1980-81లో భారత్ తరుపున ఓ టెస్టు, ఆరు వన్డే మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో ఓ వికెట్, వన్డేల్లో నాలుగు వికెట్లు తీశాడు. ఇక కపిల్ దేవ్ విషయానికి వస్తే.. భారత్ తరుపున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5248 పరుగులు చేయడంతో పాటు 434 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3979 పరుగులు చేయడంతో పాటు 253 వికెట్లు తీశాడు.
Kapil Dev said “Yograj singh kon hai”?😭 pic.twitter.com/h6qkSho9UW
— Dhonism (@Dhonismforlife) January 13, 2025