Tilak Varma – Vijay Devarkonda : టీమ్ఇండియా యువ క్రికెటర్ తిలక్ వర్మతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. పిక్ వైరల్..
టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండలు అనుకోకుండా విమానంలో కలుసుకున్నారు.

Indian cricketer Tilak Varma pic with actor Vijay Deverakonda
టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండలు అనుకోకుండా విమానంలో కలుసుకున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో తిలక్ ఓ ఫోటో దిగాడు. ఈ విషయాన్ని తిలక్ స్వయంగా తన సోషల్ మీడియాలో తెలియజేస్తూ విజయ్‌తో దిగిన ఫోటోను పంచుకున్నాడు.
‘మిమ్మల్ని ఫ్లైట్‌లో కలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్న. మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం. మళ్లీ కలుద్దాం.’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో విజయ్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తిలక్ వర్మ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో వైరల్‌గా మారింది.
BCCI : ఆసీస్ పర్యటనలో ఓటమి.. బీసీసీఐ కొత్త, కఠిన నిబంధనలు..! ప్లేయర్లకు భారీ షాక్..
భారత జట్టు జనవరి 22 నుంచి ఇంగ్లాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు తిలక్ వర్మ ఎంపిక అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు ఆడనుంది.
గత నవంబర్‌లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో తిలక్ వర్మ అదరగొట్టాడు. నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత జట్టు 3-1 కైవసం చేసుకోవడంలో ఈ తెలుగు ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. చివరి రెండు టీ20ల్లోనూ సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20ల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ఇప్పటి వరకు తిలక్ వర్మ టీమ్ఇండియా తరుపున నాలుగు వన్డేలు, 20 టీ20లు ఆడాడు. 4 వన్డేల్లో 22.7 సగటుతో 68 పరుగులు మాత్రమే చేశాడు. 20 టీ20ల్లో 51.3 సగటుతో 616 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 38 ఐపీఎల్ మ్యాచుల్లో 39.9 సగటుతో ఆరు హాఫ్ సెంచరీల సాయంతో 1156 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్ పర్యటకు భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ , వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్).
భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
జనవరి 22న తొలి టీ20 మ్యాచ్ – వేదిక కోల్‌కతా
జనవరి 25న రెండో టీ20 మ్యాచ్ – వేదిక చెన్నై
జనవరి 28న మూడో టీ20 మ్యాచ్ – వేదిక రాజ్‌కోట్
జనవరి 31న – నాలుగో టీ20 మ్యాచ్ – వేదిక పూణె
ఫిబ్రవరి 2న – ఐదో టీ20 మ్యాచ్ – వేదిక ముంబై.