Nitish Kumar Reddy : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి.. మోకాళ్ల పై మెట్లెక్కి..
టీమ్ఇండియా క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తిరుమల వెళ్లాడు.

Nitish Kumar Reddy visits Tirupati Today
టీమ్ఇండియా క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తిరుమల వెళ్లాడు. ఈ తెల్లవారుజామున ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్నాడు. మోకాళ్ల పర్వతం వద్ద నితీశ్ మోకాళ్ల పై మెట్లు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతడు.. బ్యాట్, బంతితోనూ రాణించాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక మెల్‌బోర్న్ టెస్టులో శతకంతో టీమ్ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు.
మొత్తంగా ఈ ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో నితీశ్ 37.25 సగటుతో 298 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్‌లోనూ 5 వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. ఈనెల 22 నుంచి ఇంగ్లాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది.
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ఇక ఎప్పటికీ కెప్టెన్ కాలేడా..? కారణం ఏమిటంటే..
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టీ20 – జనవరి 22 (కోల్‌కతా)
రెండో టీ20 – జనవరి 25 (చెన్నై)
మూడో టీ20 – జనవరి 28 (రాజ్ కోట్)
నాలుగో టీ20 – జనవరి 31 (పుణే)
ఐదో టీ20 – ఫిబ్రవరి 2న (ముంబై)
Nitish reddy going for Tirumala Tirupati, lord Venkateshwara swamy darshan #Tirupati #nitishkumarreddy
— vyas laxminarayana(lakhan vyas) (@lakhan586) January 13, 2025