Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ఇక ఎప్పటికీ కెప్టెన్ కాలేడా..? కారణం ఏమిటంటే..

జస్ర్పీత్ బుమ్రా బోర్డర్ గావస్కర్ సిరీస్ లో తొలి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది.

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ఇక ఎప్పటికీ కెప్టెన్ కాలేడా..? కారణం ఏమిటంటే..

Jasprit bumrah

Updated On : January 13, 2025 / 1:34 PM IST

Jasprit Bumrah: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీనికితోడు వ్యక్తిగతంగా పరుగులు రాబట్టడంలో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. దీంతో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు అతను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే, రోహిత్ మరికొన్ని నెలలు కెప్టెన్ గా ఉంటానంటూ బీసీసీఐకి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. టీమిండియా తదుపరి టెస్టు సిరీస్ ను ఇంగ్లండ్ జట్టుతో ఆడనుంది. ఈ సిరీస్ జూన్ లో ప్రారంభమవుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సీజన్ కూడా అప్పుడే ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మను పక్కనపెట్టి జస్ర్పీత్ బుమ్రా సారథ్యంలో ఆడితేనే బాగుంటుందనే అభిప్రాయం బోర్డు సభ్యుల నుంచి, పలువురు మాజీ క్రికెటర్ల నుంచి వ్యక్తమవుతుంది.

Also Read: Yuvraj Singh Father: కపిల్ దేవ్‌ను చంపడానికి తుపాకీతో ఆయన ఇంటికెళ్లా.. యువరాజ్ సింగ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

జస్ర్పీత్ బుమ్రా బోర్డర్ గావస్కర్ సిరీస్ లో తొలి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. దీంతో బుమ్రా కెప్టెన్ గా భారత జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించగలడని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే, బుమ్రా గాయంతో బాధపడుతున్నాడు. అతని వెన్ను నొప్పి కారణంగా రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. బీసీసీఐ సమీక్షలో బుమ్రా గాయంపై చర్చజరిగింది. బుమ్రా గతంలోనూ గాయం కారణంగా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే అతనిపై మరింత భారం పడుతుందని బీసీసీఐ సమీక్షలో పలువురు పేర్కొన్నారట.

Also Read: బీసీసీఐ కొత్త కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియాను కలిసిన హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రావు

బుమ్రాను కెప్టెన్ గా చేసినా.. సిరీస్ మధ్యలో గాయపడితే అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు అనే ప్రశ్న మిగిలిపోతుంది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ కొన్ని మ్యాచ్ లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. దీంతో బుమ్రాకు ప్రత్యామ్నాయంగా కొత్త సారథిని సిద్ధం చేయాలనే ఆలోచనలోనూ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో రిషబ్ పంత్, జైస్వాల్ పేర్లు బోర్డు పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.

 

రిషబ్ పంత్ ఇప్పటికే పలు మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జట్టును నడిపించడంలో సమర్ధుడిగా నిరూపించుకున్నాడు. అయితే, కొన్ని మ్యాచ్ లకు జస్ర్పీత్ బుమ్రాను కెప్టెన్ గా కొనసాగిస్తూ పంత్ ను వైస్ కెప్టెన్ గా కొనసాగించాలని బోర్డు సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. యశస్వీ జైస్వాల్ నేర్చుకునే దశలో ఉన్నాడు.. ఇప్పుడే అతనిపై అదనపు భారం పెట్టడం వల్ల బ్యాటింగ్ గతి తప్పే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ రోహిత్ శర్మను మరికొన్ని మ్యాచ్ లకు కెప్టెన్ గా కొనసాగించి ప్రత్యామ్నాయ కెప్టెన్ గా పంత్ ను కొనసాగించాలని బోర్డులో పలువురు పేర్కొనట్లు సమాచారం. అలాఅయితే, రోహిత్ రిటైర్మెంట్ సమయానికి పంత్ బలోపేతం అవుతాడని.. రెగ్యూలర్ కెప్టెన్ గా అతన్నే కొనసాగించే అవకాశం కూడా ఉంటుందని పలువురు సూచించినట్లు తెలిసింది. ఇదే జరిగితే రాబోయే కాలంలో బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కకపోవచ్చు. అయితే, బోర్డు సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.