Sankranthiki Vasthunam : బాక్సాఫీస్ వ‌ద్ద ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ క‌లెక్ష‌న్ల సునామీ.. ఆనందంలో మూవీ టీమ్‌.. నాలుగు రోజుల్లో ఎంతంటే..?

ఈ సంక్రాంతికి విడుద‌లైన మూవీల్లో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ ఒక‌టి.

Sankranthiki Vasthunam : బాక్సాఫీస్ వ‌ద్ద ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ క‌లెక్ష‌న్ల సునామీ.. ఆనందంలో మూవీ టీమ్‌.. నాలుగు రోజుల్లో ఎంతంటే..?

Sankranthiki Vasthunam Movie four days collections details here

Updated On : January 18, 2025 / 11:11 AM IST

ఈ సంక్రాంతికి విడుద‌లైన మూవీల్లో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ ఒక‌టి. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అనిల్, వెంకీ మార్క్‌ల కామెడీతో తొలి ఆట నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆక‌ట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద త‌న దూకుడును చూపిస్తోంది. విడుద‌లైన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇక నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్లంగా రూ.131 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది.

మొద‌టి రోజు ఈ చిత్రం రూ.45 కోట్ల గ్రాస్‌ను సాధించి వెంక‌టేష్ కెరీర్‌లోనే తొలిరోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. ఇక రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.29 కోట్లు రాబ‌ట్ట‌గా నాలుగో రోజు రూ.25 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

Dance IKON 2 : ఆహాలో డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.131 కోట్లు రాబ‌ట్టిన‌ట్లు చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ఇక నేడు శ‌నివారం, రేపు ఆదివారం కావ‌డంతో వ‌సూళ్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ కి నెగిటివ్ ప్రచారం చేసింది ఎవరు?

మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్ లు క‌థానాయిక‌లు న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.