Super hit Movie Mad Sequel Mad Square Release Date Announced
MAD Square : అందరూ కొత్తవాళ్లతో 2023లో వచ్చిన మ్యాడ్ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా ఓ కాలేజీ విద్యార్థులు కథను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చెప్పడంతో ఈ సినిమా అందరికి నచ్చేసి పెద్ద హిట్ అయి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ గతంలోనే ప్రకటించి మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ పెట్టారు.
ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ సినిమా నుంచి రెండు పాటలు వచ్చి మంచి హిట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా 2025 మార్చి 29న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఉన్న నలుగురు మెయిన్ అబ్బాయిల పాత్రలతో ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. మీరు హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ వినోదం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మ్యాడ్ నెస్ అని తెలిపారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే మార్చ్ 28 హరిహర వీరమల్లు సినిమా ప్రకటించారు. ఈ సినిమా మార్చ్ 29 అని అనౌన్స్ చేయడంతో హరిహర వీరమల్లు వాయిదా పడుతుందని భావిస్తున్నారు.
More FUN than you can handle 😉
More MADNESS than you can imagine 🕺🏻#MADSquare is all set to take the Entertainment game to the next level from MARCH 29th in theatres ❤️@NarneNithiin #SangeethShobhan #RamNitin @kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya… pic.twitter.com/yAxNoCHDgs— Sithara Entertainments (@SitharaEnts) January 18, 2025
Also Read : Dilruba Song : కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..