Manchu Vishnu Comments on Kannappa prequel and tells about story line
Kannappa : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు జూన్ 27 రిలీజ్ కానుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్.. లాంటి స్టార్స్ నటించడం, పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రిలీజ్ కి ముందు నేడు విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో విష్ణు, సినిమా దర్శకుడు ముకేశ్ కుమార్ కన్నప్ప సీక్వెల్ గురించి మాట్లాడారు. దర్శకుడు మాట్లాడుతూ.. కాళహస్తి నుండి అర్చకులని తీసుకొచ్చి కన్నప్ప సినిమా చూపించాం. ఒక అర్చకుడు కన్నప్ప పార్ట్ 2 ఎప్పుడు తీస్తారు అని అడిగారు. అది కష్టం కాబట్టి ప్రీక్వెల్ తీసే అవకాశం ఉండొచ్చు అని తెలిపారు.
Also See : Deputy CM Pawan Kalyan : కొత్త లుక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టక్ వేసి.. ఫొటోలు వైరల్..
విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప శివుడిలో లీనం అయ్యాక ఇంక సీక్వెల్ ఏం ఉంటుంది. కానీ ప్రీక్వెల్ ఉంటుండొచ్చు. అదంతా వార్ ఎపిసోడ్స్ తో ఉంటుంది. అది కూడా సినిమా రిజల్ట్ ని బట్టి ఆలోచిస్తాను అని తెలిపారు.
కన్నప్ప శివభక్తుడిగా మారి, శివుడిలో లీనం అయిన కథ అందరికి తెలిసిందే. అయితే విష్ణు కన్నప్ప సినిమాలో కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కన్నప్ప తిన్నడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, అతను చేసిన యుద్దాలు ఏంటి, అతను ఒక గొప్ప పోరాట యోధుడు అని చూపించబోతున్నారు. కన్నప్ప సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చాలానే ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో కన్నప్ప ప్రీక్వెల్ చేస్తే తిన్నడు చేసే యుద్ధాల ఎపిసోడ్స్ తోనే తీసే అవకాశం ఉంటుందని క్లారిటీ ఇచ్చేసాడు విష్ణు.
Also Read : Prabhas – Vishnu : ప్రభాస్ నాకేం ఫుడ్ పెట్టలేదు.. నేనే పెట్టాను.. మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు..