Prabhas – Vishnu : ప్రభాస్ నాకేం ఫుడ్ పెట్టలేదు.. నేనే పెట్టాను.. మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రభాస్ అందరికి ఏ రేంజ్ లో ఫుడ్ పెడతాడో అందరికి తెలిసిందే.

Manchu Vishnu Interesting Comments on Prabhas Food in Kannappa press meet
Prabhas – Vishnu : ప్రభాస్ అందరికి ఏ రేంజ్ లో ఫుడ్ పెడతాడో అందరికి తెలిసిందే. ప్రభాస్ సినిమా ఉందంటే సెట్లో చాలా మందికి తన ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్ తెప్పిస్తాడు. కడుపు నిండేదాకా పెడతాడు. చాలా మంది హీరోయిన్స్, నటీనటులు ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి గొప్పలు చెప్పారు. అయితే తాజాగా మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో దాదాపు అరగంటసేపు ప్రభాస్ కనపడతాడని సమాచారం. కన్నప్ప రేపు జూన్ 27 రిలీజ్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కన్నప్ప సినిమా ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు మంచు విష్ణు.
ఈ క్రమంలో ప్రభాస్ షూట్ లో ఫుడ్ తెప్పిస్తారు కదా మీకేం తెప్పించారు అని అడగ్గా మంచు విష్ణు సమాధానమిస్తూ.. ప్రభాస్ నాకేం ఫుడ్ పెట్టలేదు. అందరికి ప్రభాస్ పెడతాడు. కానీ నేను ప్రభాస్ కి ఫుడ్ పెట్టాను. స్పెషల్ కుక్ ని తీసుకొచ్చి మరీ ఫుడ్ చేయించి ప్రభాస్ కి పెట్టాను. కావాలంటే ప్రభాస్ ని అడగండి అని అన్నారు. దీంతో విష్ణు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ప్రభాస్ ఫ్యూచర్ లో విష్ణు పెట్టిన ఫుడ్ గురించి మాట్లాడతాడేమో చూడాలి.