Dhee : కన్నప్ప వచ్చేముందు ‘ఢీ’ కొట్టబోతున్న మంచు విష్ణు.. ‘ఢీ’ రీ రిలీజ్ ఎప్పుడంటే..

మంచు విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'ఢీ' సినిమా రీ రిలీజ్ కాబోతుంది.

Manchu Vishnu Dhee Movie Re Release Details Here

Dhee : ఇటీవల రీ రిలీజ్ ల ట్రెండ్ బాగా ఎక్కువైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు హిట్ అయిన సినిమాలు, క్లాసిక్ సినిమాలు ఇటీవల బాగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ లు ఎక్కువై వారానికి ఒక పాత సినిమా రీ రిలీజ్ అవుతుంది. నిన్న కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ చేశారు. మార్చ్ 14 యుగానికి ఒక్కడు సినిమా రీ రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో సినిమా చేరింది.

Also Read : Chiranjeevi : ఆ సినిమా కోసం ట్రైన్ మీద రియల్ సీన్.. నాన్న చూసి పిచ్చ తిట్లు.. చరణ్ ని మగధీరలో అలా చూశాక..

మంచు విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘ఢీ’ సినిమా రీ రిలీజ్ కాబోతుంది. మంచు విష్ణు భారీగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తుండగా ఈ లోపే ఢీ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నాడు. మంచు విష్ణు, జెనీలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ సినిమా 2007లో రిలీజయి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా మార్చ్ 28న రీ రిలీజ్ చేస్తున్నారు.

మరి మంచు ఫ్యాన్స్, విష్ణు ఫ్యాన్స్, ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ కోసం, జెనీలియా కోసం ఢీ రీ రిలీజ్ కి ఎంతమంది వెళ్తారో చూడాలి.