Chiranjeevi : ఆ సినిమా కోసం ట్రైన్ మీద రియల్ సీన్.. నాన్న చూసి పిచ్చ తిట్లు.. చరణ్ ని మగధీరలో అలా చూశాక..
చిరంజీవి వాళ్ళ నాన్న గురించి కూడా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు.

Chiranjeevi Interesting Comments on his Father and Ram Charan Regarding Action Scenes
Chiranjeevi : నేడు ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తల్లి అంజనమ్మతో చిరంజీవి, నాగబాబు, మాధవి, విజయ దుర్గ.. లతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో చిరంజీవి వాళ్ళ నాన్న గురించి కూడా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు.
చిరంజీవి మాట్లాడుతూ.. గుండా సినిమా సమయంలో రాజమండ్రి దగ్గర షూటింగ్ జరిగింది. నాన్న కూడా వచ్చారు అప్పుడు. ట్రైన్ మీద, ట్రైన్ మధ్యలో యాక్షన్ సీన్స్ చేశాను. ఆ సీన్స్ చూసి నాన్న నన్ను తిట్టారు. ఎందుకు అంత కష్టమైన సీన్స్ చేస్తావు అని. నేను సేఫ్టీ తీసుకొనే చేస్తున్నాను నాన్న అని చెప్పేవాడిని. అలా చాలా సార్లు నా రియల్ యాక్షన్ సీన్స్ చూసి తిట్టారు. నీకు ఇప్పుడు ఏమి అనిపించదు.. రేపు నీ కొడుకు కూడా ఇలాగే చేస్తే అప్పుడు నువ్వు కూడా భయపడతావు అని అనేవారు. ఆ తర్వాత మగధీర సమయంలో చరణ్ గుర్రం ఎక్కి రోడ్డు మీద పడిపోయినప్పుడు, మగధీర బైక్ స్టంట్ సమయంలో పీటర్ హెయిన్స్ కి దెబ్బలు తగిలినప్పుడు చరణ్ కి జరిగితే ఏంటి పరిస్థితి అని భయం వేసింది. అప్పుడు నాన్నే గుర్తొచ్చారు. నాన్న నాకు ఎందుకు అలా చెప్పారో అప్పుడు తెలిసింది అని తెలిపారు.
చిరంజీవి ట్రైన్ పై గుండా సినిమాలో చేసిన రియల్ యాక్షన్ సీన్ ఇదే..