Chiranjeevi Daughter : నా రెండో కూతురు లైఫ్ లో ఆటంకాలు వచ్చాయి.. అప్పుడు మా అమ్మే.. శ్రీజ లైఫ్ గురించి చిరు వ్యాఖ్యలు..
తాజాగా చిరంజీవి తన కూతురు జీవితం గురించి మాట్లాడారు.

Chiranjeevi Interesting Comments on his Daughter Sreeja Konidela
Chiranjeevi Daughter : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీజ మొదట ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం అతనితో విడాకులు అయ్యాక కళ్యాణ్ దేవ్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. అతనితో కూడా కొన్నేళ్ల క్రితం విడిపోయింది. శ్రీజకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీజ తన ప్రేమ, పెళ్లిళ్లతో వార్తల్లో బాగా వైరల్ అయింది.
అయితే తాజాగా చిరంజీవి తన కూతురు జీవితం గురించి మాట్లాడారు. నేడు ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తల్లితో మెగా వుమెన్ అని స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. చిరంజీవి తల్లి అంజనమ్మ, చిరంజీవి, నాగబాబు, చిరంజీవి చెల్లెల్లు మాధవి, విజయ దుర్గలు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాల గురించి మాట్లాడారు.
ఈ క్రమంలో చిరంజీవి తల్లి అంజనాదేవి తన కూతుళ్ళకు, తన పిల్లలకు ఎలా ధైర్యం నూరిపోసిందే వాళ్ళు చెప్పారు. దీంతో చిరంజీవి మాట్లాడుతూ.. నా రెండో కూతురు శ్రీజ లైఫ్ లో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు శ్రీజ కూడా మా అమ్మ దగ్గరికి వచ్చింది. తర్వాత శ్రీజ.. నానమ్మ దగ్గరికి వెళ్తే చాలా బాగా మాట్లాడింది, సపోర్ట్ ఇచ్చింది. నానమ్మ దగ్గర కూర్చుంటే ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది అని నాకు చెప్పింది. మా అమ్మ కూడా లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు. ఒకరి వల్ల నీ జీవితం ఆగిపోకూడదు. మనల్ని వాళ్ళు నియంత్రించడం వద్దు. నీ మనసులో ఏది అనిపిస్తే అది చెయ్యి అని తనకు చెప్పింది. మా అమ్మే అందరికి ధైర్యం నూరిపోసేవాళ్ళు అని తెలిపారు.
Also Read : Chiranjeevi : నా చెల్లి మరణం ఇప్పటికీ గుర్తుంది.. మా నాన్న లేకుండానే కార్యక్రమాలు.. మెగాస్టార్ ఎమోషనల్..
ఇక ప్రస్తుతం శ్రీజ తన ఇద్దరి కూతుళ్ళతోనే ఉంటుంది. ఇటీవలే ఫ్రెండ్స్ తో కలిసి సీ సా స్పేసెస్ అనే ప్లే స్కూల్ బిజినెస్ ప్రారంభించింది.
మెగా వుమెన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..