Manchu Vishnu : ‘మా’ సభ్యులకు మంచు విష్ణు వరాలు.. రాజకీయ నాయకులని మించి..

తాను గెలిస్తే అసోసియేషన్‌కు ఏమేమి చేస్తానో చెప్తూ మీడియా ముందు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఈ మేనిఫెస్టో చూస్తే ఎలక్షన్స్ కి రాజకీయ నాయకులు ఇచ్చే వరాల కంటే మించిపోయింది.

Maa (1)

Manchu Vishnu :  ‘మా’ అసోషియేషన్ ఎన్నికల నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రకాష్ రాజ్ అంతకు ముందే రిలీజ్ చేశారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తాను గెలిస్తే అసోసియేషన్‌కు ఏమేమి చేస్తానో చెప్తూ మీడియా ముందు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఈ మేనిఫెస్టో చూస్తే ఎలక్షన్స్ కి రాజకీయ నాయకులు ఇచ్చే వరాల కంటే మించిపోయింది.

విష్ణు మేనిఫెస్టోలో ఉన్న ప్రధానాంశాలు…..

‘మా’ భవనాన్ని తన సొంత డబ్బుతో కడతానని హామీ ఇచ్చారు. ఇప్పటికే మూడు స్థలాలు చూసామని, వాటిలో సినీ పెద్దలతో చర్చించి ఒక దాన్ని సెలెక్ట్ చేసి కడతామని, భవిష్యత్తులో కూడా ఉపయోగపడేలా ‘మా’ భవనం కట్టడం.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న కొందరు సభ్యులు సినిమాల్లో నటించడానికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మా యాప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క ‘మా’ సభ్యుల పోర్ట్ ఫోలియో అందులో ఉంచుతామని, మా యాప్ నిర్మాతలకి, దర్శకులకి, రచయితలకి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌కి అందుబాటులో ఉండేలా చూస్తామని, దీని వల్ల మా సభ్యులకి సినిమాలు, ఓటిటి వంటి వివిధ మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడం.

అర్హులైన ‘మా’ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో సొంతింటిని నిర్మించి ఇవ్వడం.

‘మా’లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు, కుటుంబ సభ్యులకు హెల్త్ ఇన్స్యూరెన్స్, కార్పొరేట్ హాస్పిటల్స్‌తో అనుసంధానం చేసి ‘మా’ కుటుంబ సభ్యులందరికీ వైద్యం అందించడం, మూడు నెలలకు ఒకసారి ‘మా’ కుటుంబ సభ్యులందరికి ఉచిత వైద్య శిబిరాలు, ప్రతి ఒక్క ‘మా’ సభ్యుడికి ఉచితంగా ESI హెల్త్ కార్డు అందించే ఏర్పాటు.

మంచు విష్ణు ఎలక్షన్ మేనిఫెస్టో

గెలిచిన వెంటనే పెన్షన్ల కోసం పెట్టుకుని ఉన్న దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులైన వారందరికీ ప్రతి నెలా పెన్షన్లు అందేలా చూడటం, ప్రస్తుతం 6,000/-లు ఉన్న పెన్షన్‌ను పెంచడం.

అర్హులైన ‘మా’ సభ్యుల పిల్లలకు KG to PG వరకు విద్యా సాయం..

అర్హులైన ‘మా’ సభ్యులకు ‘మా’ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్షా పదహారు వేల ఆర్థిక సాయం..

‘మా’ చరిత్రలో మొట్ట మొదటిసారిగా మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణ కోసం హై పవర్ కమిటీ ఏర్పాటు.

కొన్ని రోజుల వరకు కొత్తగా ‘మా’ మెంబర్‌షిప్‌ తీసుకునేవారికి రూ.75వేలకే సభ్యత్వం

Sharukh Khan : షారుఖ్ పార్టీలో డ్రగ్స్.. బాలీవుడ్ స్టార్ భార్యలు సైతం..

ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చురుకుగా చేపట్టడానికి ఒక కల్చరల్ అండ్ ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించి ‘మా’ని ఆర్థికంగా బలపరచడం.

‘మా’ ఎన్నికలలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులని కలుసుకుని వాళ్ల‌తో సత్సంబంధాలు నెలకొల్పుకుని, మన తెలుగు చలనచిత్ర సమస్యల పరిష్కారాలకి, దాని అభివృద్ధి ప్రణాళికలకు సంపూర్ణ సహాయ సహకారాలను కోరడం..

‘మా’ సభ్యుల పిల్లలకు సినిమాలపై అభిరుచి ఉంటే మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో 50% స్కాలర్‌ షిప్‌తో శిక్షణ, వేరే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్‌లోనూ తగినంత డిస్కౌంటు ఇప్పించే ప్రయత్నం.