Sharukh Khan : షారుఖ్ పార్టీలో డ్రగ్స్.. బాలీవుడ్ స్టార్ భార్యలు సైతం..

షారుఖ్ కి ఐపీఎల్‌ లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అనే టీమ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఆ టీంకి సంబంధించి షారుఖ్ ఓ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి తాను కూడా వెళ్లానని

Sharukh Khan : షారుఖ్ పార్టీలో డ్రగ్స్.. బాలీవుడ్ స్టార్ భార్యలు సైతం..

Sharuk

Sharukh Khan :  బాలీవుడ్‌ స్టార్‌ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తాజాగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు డ్రగ్స్ కేసు బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుండగా ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో షారుఖ్ తనయుడు డైరెక్ట్ గా డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో బాలీవుడ్ షాక్ కి గురయ్యింది. నెటిజన్లు బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రా డ్రగ్స్‌ గురించి మాట్లాడిన పాత వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఆ వీడియోలో గతంలో షారుక్‌ ఖాన్‌ ఇచ్చిన పార్టీలో తను చూసిన విషయాల గురించి షెర్లిన్‌ తెలిపింది. షారుఖ్ కి ఐపీఎల్‌ లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అనే టీమ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఆ టీంకి సంబంధించి షారుఖ్ ఓ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి తాను కూడా వెళ్లానని, పార్టీలో డ్యాన్స్ చేసి అలసిపోయి వాష్‌రూమ్‌కు వెళ్లాను. డోర్ ఓపెన్ చేయగానే అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యాను. ఒక్క క్షణం తర్వాత నాకు విషయం అర్థమైంది. అక్కడుంది బాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల భార్యలు అని. అందరూ అక్కడి అద్దాల ముందు నిల్చుని తెల్లని పౌడర్ పీలుస్తున్నారు. వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని అర్థమై షాకయ్యాను. వారిని చూసి బయటకు వచ్చేశాను. తర్వాత షారుక్‌కి, అతడి స్నేహితులకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయాను. బాలీవుడ్‌లో జరిగే పార్టీలు గురించి ఆ రోజే పూర్తిగా తెలిసింది. ఆ తరువాత మళ్ళీ అలాంటి పార్టీలకు వెళ్ళలేదు, వెళ్లదలుచుకోలేదు అని షెర్లిన్ ఈ వీడియోలో తెలిపింది.

MAA Elections : అప్పుడు మోహన్ బాబు.. ఇప్పుడు విష్ణు.. 17 ఏళ్ల తర్వాత సీన్ రిపీట్ అవ్వుద్దా??

ఓ పక్క షారుఖ్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ విషయం బాలీవుడ్‌ని కుదిపేస్తున్న తరుణంలో ఈ భామ విడుదల చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.