MAA Elections : అప్పుడు మోహన్ బాబు.. ఇప్పుడు విష్ణు.. 17 ఏళ్ల తర్వాత సీన్ రిపీట్ అవ్వుద్దా??

కానీ అప్పటి ఎలక్షన్స్ లో మోహన్ బాబు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సారి మాత్రం ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది.

MAA Elections : అప్పుడు మోహన్ బాబు.. ఇప్పుడు విష్ణు.. 17 ఏళ్ల తర్వాత సీన్ రిపీట్ అవ్వుద్దా??

Mohan Babu

MAA Elections :  ఈ సారి సినీ ‘మా’ ఎన్నికలు బాగా రసవత్తరంగా జరగనున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానల్స్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్టు ఫిర్యాదుల వరకు వెళ్లారు. టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తుంది. ‘మా’ ఎలక్షన్స్ వేడి రోజు రోజుకి పెరుగుతుంది. అక్టోబర్ 10వ తేదీన ‘మా’ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు దగ్గ్గర పడటంతో ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు ప్యానెళ్లు ప్రచార జోరు పెంచారు.

1998లో అక్కినేని నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షుడిగా, హీరో కృష్ణ అధ్యక్షుడిగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రారంభమైంది. చాలా వరకు పోటీ లేకుండా ప్రశాంతంగా ‘మా’ ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి అలాంటి ప్రశాంతత కనిపించట్లేదు. అయితే ఈ సారి మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. సరిగ్గా 17 ఏళ్ళక్రితం 2004 అక్టోబర్ 10న కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మోహన్ బాబు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. మళ్ళీ సరిగ్గా 17 ఏళ్ళకు అదే రోజున ఇప్పుడు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ సారి మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేస్తుండటం విశేషం.

Raghavendrarao : రాఘవేంద్రరావు హీరోగా మరో సినిమా..

కానీ అప్పటి ఎలక్షన్స్ లో మోహన్ బాబు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సారి మాత్రం ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది. మరో నాలుగు రోజుల్లో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో ఎవరి ప్యానల్ నెగ్గుతుందో అని టాలీవుడ్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.