Raghavendrarao : రాఘవేంద్రరావు హీరోగా మరో సినిమా..

ఇన్నాళ్ళు డైరెక్టర్ గా మెప్పించి ఇప్పుడు ఈ సినిమాలో వశిష్ట అనే పాత్రతో నటనలో ప్రేక్షకులని అలరించబోతున్నారు. అంతకుముందే రాఘవేంద్రరావు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది తెలియచేశారు.

Raghavendrarao : రాఘవేంద్రరావు హీరోగా మరో సినిమా..

Raghavendrarao

Raghavendrarao :  కొంతమంది దర్శకులు ఆర్టిస్టులుగానూ చేస్తూ ఉంటారు. కొంతమంది హీరోలుగా కూడా చేస్తున్నారు. కొంతమంది డైరెక్టర్స్ గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ 100కి పైగా సినిమాలు తీసిన దర్శకేందుడు రాఘవేంద్రరావు మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. కనీసం గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇవ్వలేదు. 2017లో ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అప్పట్నుంచి సినిమాలకి దూరంగా ఉన్నారు. అయితే ఇకపై దర్శకుడిగా విరామం తీసుకొని నటనపై ద్రుష్టి సారించినట్టు తెలుస్తుంది.

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న ‘పెళ్లి సందD’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని తెలిసిందే. ఇప్పటికే ఈయన రోల్ కి సంబంధించి టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇన్నాళ్ళు డైరెక్టర్ గా మెప్పించి ఇప్పుడు ఈ సినిమాలో వశిష్ట అనే పాత్రతో నటనలో ప్రేక్షకులని అలరించబోతున్నారు. అంతకుముందే రాఘవేంద్రరావు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది తెలియచేశారు. దానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి అయింది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ మొదలవ్వలేదు. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం.

KGF2 : ‘కెజిఫ్ 2’ రీషూట్?? ఇప్పటిదాకా తీసిన సినిమా ఏమైంది??

తాజాగా రాఘవేంద్రరావు మరో సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. రాఘవేంద్రరావు హీరోగా అరవై ఏళ్ల వ్యక్తి ప్రేమ కథ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తనికెళ్ల భరణి సినిమా పూర్తయ్యాకే ఆదిత్యతో సినిమా మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. మొత్తానికి దర్శకుడిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రాఘవేంద్రరావు ఇకపై నటుడిగా బిజీ అవ్వనున్నారని తెలుస్తోంది.