Dragon Glimpse : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ సినిమా గ్లింప్స్ వచ్చేసింది.. విలన్ గా ఎన్టీఆర్..
మీరు కూడా డ్రాగన్ గ్లింప్స్ చూసేయండి.. (Dragon Glimpse)
Dragon Glimpse
Dragon Glimpse : ఎన్టీఆర్ RRR తర్వాత దేవర సినిమాతో వచ్చినా ఆ సినిమా ఫ్యాన్స్ ఆకలి తీర్చలేదు. ఎన్టీఆర్ నుంచి అదిరిపోయే మాస్ సినిమా ఆశిస్తున్న అభిమానులకు ప్రశాంత్ నీల్ తో సినిమా అనడంతో అంచనాలు పెంచుకున్నారు. ఎప్పుడో ఆగస్టు 2024 లో ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. అప్పట్నుంచి ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఇప్పటివరకు లీక్ అయిన ఫొటోస్, ఎన్టీఆర్ లుక్స్, సినిమా షూటింగ్ అప్డేట్ లీక్స్ తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అధికారికంగా 2027 జూన్ 11 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఇంకా సంవత్సరం ఆగాలా అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Also See : Shanmukh Jaswanth : కాబోయే భార్యతో కొత్తింటి గృహప్రవేశం చేసిన షణ్ముఖ్ జస్వంత్.. ఫొటోలు వైరల్..
రేపు మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు కాగా ముందురోజే అర్ధరాత్రి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఈ సినిమా కథ స్వాతంత్య్రం ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మొదలవుతుంది. ఈ కథ అంతా హెరాయిన్ డ్రగ్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. పలు దేశాల్లో ఈ హెరాయిన్ వ్యాపారం, దీని కోసం కొట్టుకునే వాళ్ళ చుట్టూ తిరగనుంది. ఇది ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ వర్సెస్ గోల్డెన్ ట్రేడింగ్ అనే రెండు కంపెనీల మధ్య పోరులా ఉండబోతుంది. ఎన్టీఆర్ ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో హత్యలు చేసే లూగర్ అనే వ్యక్తిగా ముఖ్య పాత్రగా కనిపించపోతున్నాడు. మీరు కూడా డ్రాగన్ గ్లింప్స్ చూసేయండి..
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రుక్మిణి వసంత్, అనిల్ కపూర్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రానా,అంశుమాన్ పుష్కర్, సిద్ధాన్త గుప్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, బిమల్ జీత్ ఒబెరాయి, మరికొంతమంది విదేశీ నటులు నటిస్తున్నారు.
